కృష్ణ

సీఎం ‘దీక్ష’కు తరలిన తమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 20: విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వెళ్లారు. జిల్లా నలుమూలల నుండి ప్రజా ప్రతినిధులు, పార్టీ, అనుబంధ కమిటీల్లో కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు వేలాదిగా దీక్షా స్థలికి తరలి వెళ్లి సీఎం చంద్రబాబుకు బాసటగా నిలిచారు. గ్రామ గ్రామానికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు. నియోజకవర్గానికి 3వేలు నుండి 5వేలు తగ్గకుండా 16 నియోజకవర్గాల నుండి తరలింపు కార్యక్రమం జరిగింది. నేటి నుండి ఎనిమిది రోజుల పాటు సైకిల్ యాత్రలకు తెర లేపారు. 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో సైకిల్ యాత్రలు నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం ఇప్పటికే పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదాపై గ్రామీణ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు ప్రకటించారు. ఎనిమిది రోజుల పాటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేల నేతృత్వంలో సైకిల్‌కు ఒక వైపు పార్టీ జెండా, మరో వైపు నల్ల జెండాలు కట్టి యాత్రలు చేయనున్నారు. యాత్రల ముగింపు అనంతరం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసేందుకు వ్యూహ రచనలు పన్నుతోంది.

జాతీయ లోక్ అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు
* 8,107 కేసుల పరిష్కారమే లక్ష్యం
* 37 బెంచ్‌లు ఏర్పాటు చేశాం
* జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు
మచిలీపట్నం, ఏప్రిల్ 20: ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ ఆదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు క్రమం తప్పకుండా జాతీయ మెగా లోక్ ఆదాలత్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న లోక్ ఆదాలత్‌లో 8వేల 107 కేసులను పరిష్కరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందు కోసం అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. లోక్ ఆదాలత్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 37 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ ఉపాధ్యక్షునిగా ఫణిభూషణ్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 20: కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షునిగా పట్టణానికి చెందిన కోకా ఫణిభూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహనరావు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో విశేష సేవలు అందిస్తున్న ఫణిభూషణ్‌ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.