కృష్ణ

వర్మ పాత్ర వెనుక టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఏప్రిల్ 20: రాజకీయంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎదుర్కోలేక పలు కల్పిత పాత్రలతో వెనుక నుండి కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కొవ్వొత్తున ప్రదర్శనను లెనిన్ సెంటర్ నుండి ఎంఆర్‌వో కార్యాలయం వరకు జనసేన శ్రేణులు నిర్వహించారు. ఈసందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. రాంగోపాల్ వర్మ సమాజానికి పట్టిన చీడ పురుగు అని వ్యాఖ్యానించిన ఆయన వర్మను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్మ వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను బయట పెట్టకపోతే టీడీపీ హస్తం ఉందని భావించాల్సి వస్తోందన్నారు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పుకునే కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు పవన్‌పై కుట్రలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తన కెరియర్‌ను కూడా పక్కన పెట్టి పోరాటం చేస్తున్న పవన్‌ను ఆయన తల్లిని తిట్టిన తిట్లు ఎంతో బాధ కలిగించాయన్నారు. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు మరోసారి మోసపూర్తి దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దీక్ష సమయంలో తన చుట్టూ ఏసీలను పెట్టుకుని ప్రజల సొమ్ముతో హైటెక్ దీక్షను బాబు చేశారని ఎద్దేవా చేశారు. హోదా అంశంలో బాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తెచ్చేది, సాధించేంది పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. ఈకార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు బీ వంశీ, కృష్ణప్రసాదు, శ్యాముప్రసాదు, శిరీష, రామకృష్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రంగా శాఖమూరు ఉద్యానవనం
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 20: ప్రజారాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఉద్యానవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపర్చుతున్నట్టు అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ డీ లక్ష్మీపార్ధసారధి పేర్కొన్నారు. పర్యాటక పాలసీని అనుసరించి సుమారు 300 ఎకరాల్లో సెంట్రల్ పార్కుగా నిర్మిస్తున్నట్టు తెలిపిన ఆమె దీనిని ప్రగతి గ్రూప్ సంస్థకు పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ పద్దతిలో అనుమతి పత్రాలను శుక్రవారం అందజేశారు. ఆద్యంతం పచ్చదనంతో నిండి ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి అందాలతో సందర్శకులను ఆకుట్టుకునేలా పార్కులో ఏర్పాటు చేయబోయే నక్షత్ర, రాశి, నవగ్రహ వనాలు, ఉడెన్ కాటేజీలను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించే ఈ పార్కును అమరావతి నగరానికే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలని ఏడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ పట్టణ ప్రణాళిక విభాగాధిపతి పి సురేష్‌బాబు, టౌన్ ప్లానింగ్ సలహాదారు పి తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.