కృష్ణ

మోదీని విమర్శించే స్థాయబాలకృష్ణకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 20: భారత ప్రధాని నరేంద్రమోదీని విమర్శించే స్థాయి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మోదీని విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రజలను టీలో ఈగలుగా పోల్చడం తెలుగువారిని అవమానపర్చడమే అన్నారు. బాలకృష్ణకి మతిస్థిమితం లేదని డాక్టర్లు ధ్రువీకరించారన్నారు. మతిస్థిమితం లేని వ్యిక్తితో దేశ ప్రధానిపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయించడం తగదన్నారు. ఆడవారిని గౌరవించడంపై బాలకృష్ణ చెబితే తెలుసుకునే స్థితిలో బీజేపీ లేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ జయరాజు, జిల్లా కార్యదర్శి నాదెండ్ల మోహన్, శేషుమాధవి, తదితరులు పాల్గొన్నారు.

హోదా కోసం సీఎం దీక్ష సిగ్గుచేటు
వైసీపీ నేత సింహాద్రి రమేష్‌బాబు విమర్శ
అవనిగడ్డ, ఏప్రిల్ 20: స్థానిక వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియచేశారు. ముందు ప్రత్యేక ప్యాకేజీ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ దీక్షకు దిగడం శోచనీయమని నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ సింహాద్రి రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మోసపూరిత విధానాలను ప్రజలు తిప్పి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సైతం ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షుడు రేపల్లె శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసంచెప్పులతో కొట్టుకుంటూ నిరసన
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 20: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పీవీ ఫణికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం ఫణికుమార్ వినూత్న రీతిలో నిరసన తెలియచేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహం వద్ద చెప్పులతో చెంప దెబ్బలు కొట్టుకుంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణ, చోడవరపు ప్రసూన, ఎంపీటీసీ బోలెం అయోధ్య రామయ్య, ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు.

బందరు కమిషనర్‌గా సంపత్‌కుమార్ కొత్త కమిషనర్‌కు అభినందనలు
మచిలీపట్నం, ఏప్రిల్ 20: మచిలీపట్నం పురపాలక సంఘం కమిషనర్‌గా పిజె సంపత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా వ్యవహరించిన ఎం జస్వంతరావు ఇటీవల బదిలీ అవ్వగా ఆయన స్థానంలో సంపత్ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన కమిషనర్ సంపత్ కుమార్‌కు జస్వంతరావు బాధ్యతలు అప్పగించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పురపాలక సంఘం అభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తానన్నారు. బాధ్యతలు స్వీకరించిన సంపత్ కుమార్‌ను అసిస్టెంట్ కమిషనర్ చంద్రిక, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.