కృష్ణ

ఆసిఫా దోషులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 20: ఆసిఫా దోషులను కఠినంగా శిక్షించాలని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని కదువా జిల్లాలో చిన్నారి ఆసిఫాపై మానవ మృగాల అత్యాచారం, హత్య సంఘటనలపై మైలవరంలో గురువారం పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నూజివీడురోడ్‌లోని జెండా చెట్టు వద్ద నుండి రాత్రి సమయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక బోసుబొమ్మ సెంటరుకు చేరుకుని అక్కడ కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సౌత్ ఇండియా ట్రస్ట్ రీజియన్ ఇన్‌చార్జ్, మదర్ ధెరిస్సా మహిళా మండలి అధ్యక్షురాలు కోయ సుధ మాట్లాడుతూ మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు, బాలికలకు మానవ మృగాల నుండి రక్షణ కరవైందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీ సాయి సేవాదళ్ కార్యదర్శి వి బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ ఆసిఫాపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నిర్భయ చట్టం ఉన్నప్పటికీ ఇటువంటి దారుణాలు జరగటం శోచనీయమన్నారు. మహిళా చట్టాలపై మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మనె్న శ్రీనివాసరావు మాట్లాడుతూ చట్టాలు తయారు చేసే పాలకులే మహిళల జీవన విధానంపై తప్పుగా మాట్లాడుతున్నారని వారిని అవహేళన చేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటన్నారు. ఆసిఫా దోషులను కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో చిన్నారి స్నేహం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బాజి, సుధీర్, శివ, బాల భారతి నాట్యమండలి ప్రధాన కార్యదర్శి వాణీపతి శాస్ర్తీ, స్థానిక ఎస్టీ హాస్టల్ విద్యార్థినిలు, పంచాయితీ వార్డు మెంబర్లు ఉష, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
పెడన, ఏప్రిల్ 20: ఇటీవల పెడన పురపాలక సంఘంలో సంచలనం సృష్టించిన అక్రమ లే అవుట్ల వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఆరుగురు మున్సిపల్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటును ఎత్తి వేసింది. ఈ మేరకు శుక్రవారం పురపాలక సంఘానికి ప్రభుత్వ ఉత్తర్వులు అందాయి. అక్రమ లే అవుట్ల విషయంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు కమిషనర్లతో పాటు మరో నలుగురు ఉద్యోగులను గతంలో ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమ లే అవుట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో ఈ మేరకు వారిపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.