కృష్ణ

సమర్థవంతంగా కృష్ణా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: ఆగస్టులో వచ్చే కృష్ణా పుష్కరాల్లో ఎలాంటి అపశృతులు దొర్లకుండా సమర్థవంతంగా నిర్వహించాలని డిఐజి హరికుమార్ అన్నారు. శనివారం మండలంలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలైన ముక్త్యాల, రావిరాల, వేదాద్రిలో పర్యటించి ఆ గ్రామాలకు వెళ్లేరోడ్డు మార్గాలను, గ్రామంలోని వీధులను, పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా వాహనాలకు తగినట్లుగా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. గతంలో పంపిన ప్రతిపాదనలు అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల నిర్వహణలో పోలీసు శాఖ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకొని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదికను తనకు అందజేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. నందిగామ డిఎస్‌పి రాధేష్ మురళి, జగ్గయ్యపేట సిఐ లచ్చునాయుడు, చిల్లకల్లు ఎస్‌ఐ వంశీకృష్ణ పాల్గొన్నారు.