కృష్ణ

తిరుపతమ్మ ఆలయం వద్ద రెండేళ్లలో రూ.4 కోట్ల అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, మే 16: స్థానిక శ్రీ గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద గడచిన రెండేళ్లలో 4 కోట్ల 6 లక్షల అభివృధ్ధి పనులు నిర్వహించినట్లు పాలకమండలి చైర్మన్ కర్ల వెంకట నారాయణ, కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్‌లు తెలిపారు. అమ్మవారి ఆలయ పాలక మండలి గడువు బుధవారంతో ముగిసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 72 లక్షలతో సత్రం సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, 43 లక్షలతో అలివెట్టి మండపం, బేడా మండపాలకు విద్యుత్ వైరింగ్, 31 లక్షలతో అలివెట్టి మండపం, ఆలయానికి మల్టీ కలర్ పెయింట్, 26.70 లక్షలతో గోశాలలో షెడ్ల నిర్మాణం, 23 లక్షలతో గోపయ్యసదన్‌లో విఐపి, వివిఐపి షూట్ల నిర్మాణం, 20 లక్షలతో ప్రచార రథాన్ని కొనుగోలు చేయడం, గోపురం సెట్టింగ్, 18 లక్షలతో బేడా మండపం, రాజగోపురానికి రంగులు, 16 లక్షలతో అలివెట్టి మండపంపై డబ్ల్యుపిసి ప్లోరింగ్, రూ.15 లక్షలతో స్ర్తిలకు ప్రత్యేక స్నానపు గదులు, టాయిలెట్లు, పది లక్షలతో ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి కాంపౌండ్ వాల్, వాహనశాల నిర్మాణం, పది లక్షలతో దేవాలయం వద్ద పొంగళ్ల షెడ్ల మద్య ఖాళీ ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణం, రూ.10 లక్షలతో దేవస్థానం చుట్టూ సీసీ కెమెరాలు, 8.70 లక్షలతో ముండ్లపాడు, మక్కపేట రోడ్ల యందు స్వాగత ద్వారాలు, 8 లక్షలతో దేవస్థానం వద్ద అలివెట్టి మండపం తూర్పు ముందర భాగాన షెడ్డు నిర్మాణం, 8 లక్షలతో సత్రాల వద్ద 16.5 కెవి జనరేటర్ ఏర్పాటు, 8 లక్షలతో ఎల్‌ఇడి లైట్‌లు, మరో 8 లక్షలతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు, పంచాయతీ శానిటేషన్‌కు మరో 8 లక్షలు, దేవస్థానం వద్ద పార్కింగ్ స్థలం అవివృద్ధికి రూ.6.50 లక్షలు కేటాయింపు, రూ.5 లక్షలతో దేవస్థానం అడ్వర్‌టైజ్‌మెంట్ హోల్డింగ్స్ ఏర్పాటు, మూడున్నర లక్షలతో డ్రైయిన్ల నిర్మాణం, తదితర పనులు నిర్వహించినట్లు తెలిపారు. మరో 3 కోట్లతో ఏర్పాటు చేయనున్న కల్యాణ మండపానికి దేవాదాయ శాఖ అనుమతులు పొందినట్లు తెలిపారు. ఇవి కాక 2015 జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు దేవస్థానం నుండి గ్రామాభివృద్దికి రూ.3 కోట్లు కేటాయించాలని ఆదేశించడంతో ఆ నిధులతో దేవాలయం పక్కన ఉన్న బంగారు కాలనీలో అంతర్గత రోడ్లు అభివృద్ధి పర్చినట్లు తెలిపారు. గడచిన రెండేళ్లలో తమకు సహాయ సహకారాలు అందించి దేవాలయ అబివృద్ధికి కృషి చేసిన కార్యనిర్వహణ అధికారి ఎం రఘునాధ్, డిఇ రమ, ఆలయ ఉద్యోగులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి రఘునాధ్ మాట్లాడుతూ గడచిన రెండేళ్లలో గోశాల అభివృద్ధి గణనీయంగా జరిగిందని, పాలకమండలి ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో గోశాలలోని ఆవులు బలిష్టంగా తయారయ్యాయని, దీనిపై పలువురు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ మేడా గోపాలరావు, డిఇ రమ, పాలకమండలి సభ్యులు కోడె వెంకటేశ్వర్లు, బొల్లం లింగయ్య, పెనుగొండ కోటేశ్వరరావు, తునికిపాటి రామాచారి, మాదల వనజ, చెరుకూరి స్వప్న, ముండ్లపాటి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.