కృష్ణ

ఇళ్ల నిర్మాణంలో అవినీతిని ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణ అంచనా విలువను రెండింతలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ఒక హోటల్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ని పేదలకు మేలు చేకూర్చేలా అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో సబ్సిడీపై ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 6.80 లక్షల ఇళ్లను కేటాయించిందన్నారు. దేశంలో 20లక్షల ఇళ్లకు కేటాయింపులు జరిగితే అందులో ఆంధ్రప్రదేశ్‌కే సగం ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. ఇళ్ల కేటాయింపులు జరిగి నాలుగేళ్లయినా ఇప్పటివరకు పట్టించుకోని ప్రభుత్వం ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో ఇప్పుడు హడావిడిగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో వేగంగా నిర్మించేందుకు నిర్ణయించిందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగిస్తే ధరలు తగ్గాల్సిందిపోయి రెండింతలకు పెంచడం అనుమానాలకు తావిస్తోందన్నారు. షేర్‌వాల్ టెక్నాలజీలో చదరపు అడుగుకు రూ.1200లకు ఇళ్లు నిర్మించాల్సి ఉంటే దాన్ని రూ.2,400 నుంచి రూ.2500లకు పెంచారన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లకు లబ్ధిచేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటి నిర్మాణాలు అంచనాలు మూడింతలు పెరిగాయన్నారు. దీంతో పేదలపై రుణభారం పడుతోందన్నారు. టెక్నాలజీ పేరుతో దోపిడీకి పాల్పడటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శించారు. పౌరుల హక్కులను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి మేలు కలిగేలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న దోపిడీని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే తమను అరెస్టు చేసి 4 పోలీసు స్టేషన్లకు మార్చారన్నారు. పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బీజేపీను బూచిగా చూపిస్తూ, ప్రధాని మోదీని తిట్టేందుకు చంద్రబాబు దీక్షలు చేయిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యక్రమానికి అకస్మాత్తుగా అనుమతులు ఇచ్చారని దుయ్యబట్టారు. నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇంతవరకు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు.

కేరళ తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలి
* కేంద్ర విధానాలతో వ్యాపారాలు కుదేలు
* ఊమెన్ చాందీతో మళయాళీల బృందం
విజయవాడ, జూన్ 12: విజయవాడ నుంచి కేరళకు రైలును ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్రం నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడిన మళయాళీల బృందం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిసి కోరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన చాందీ మంగళవారం విజయవాడ వచ్చిన సందర్భంగా విజయవాడలోని కేరళ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది మళయాళీలు ఆయనను కలిసి వారి సమస్యలను విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్య ప్రైవేట్ వ్యాపారంగా మారిందని, దీంతో విద్యార్థుల చదువు చాలా ఆర్థికభారంగా మారిందన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలో కూడా ప్రభుత్వ విద్యా విధానాన్ని అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వలన వ్యాపారాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల వద్ద డబ్బు లేక చిన్న చిన్న వ్యాపారాలు నడవడం లేదన్నారు. వ్యాపారాలపై ఆధారపడిన మళయాళీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. ఉమెన్‌చాందీని కలిసిన వారిలో కేరళ క్లబ్ అధ్యక్షుడు జోహన్, సెక్రటరీ వాసు, మణి, హకిమ్, కృష్ణనందా, జయశంకర్, సత్యానంద్, మొహిద్ తదితరులు ఉన్నారు.