కృష్ణ

మంగినపూడికి సరికొత్త అందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 12: మసులా బీచ్ ఫెస్టివల్‌తో గుర్తింపు పొందిన మంగినపూడి బీచ్‌కు సరికొత్త శోభను తీసుకువస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఈ నెల 9, 10, 11తేదీల్లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణతో బందరు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. మంగినపూడి బీచ్ అభివృద్ధిపై గడిచిన నాలుగేళ్లగా పెట్టిన దృష్టి కారణంగానే నేడు అద్భుత విజయాన్ని అందుకోగలిగామన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ద్వారా మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందిన బీచ్‌లను దృష్టిలో పెట్టుకుని మాష్టర్ ప్లాన్ తయారు చేయిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సువిశాలమైన ప్రాంతం కలిగిన బీచ్ మంగినపూడి కావడం విశేషమన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆధునాతన రిసార్ట్స్ నిర్మిస్తామన్నారు. రూ.2కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ముందుకు వచ్చారన్నారు. జిల్లా పరిషత్ ద్వారా కూడా గెస్ట్ హౌస్ నిర్మించనన్నట్లు తెలిపారు. యువజన సంక్షేమ శాఖ ద్వారా రూ.5కోట్లతో యూత్ వెల్ఫేర్ హాస్టల్‌ను నిర్మించడం జరుగుతుందన్నారు. సాగర మాల కింద టూరిస్ట్ బోట్లు నిలిపేందుకు గాను రూ.60కోట్లతో జెట్టీ నిర్మాణానికి అనుమతులు లభించాయన్నారు. బీచ్ ఫెస్టివల్ స్ఫూర్తితో ఇకపై వారాంతపు, మాసాంతపు వినోదాత్మక కార్యక్రమాలను బీచ్ వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. రూ.5కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు స్టాల్స్ నిర్వాహకులు తెలియచేశారన్నారు. ఒక్క డ్వాక్రా బజార్ల స్టాల్స్ ద్వారానే కోటి రూపాయలు పైబడి వ్యాపారం జరగడం విశేషమన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం
మైలవరం, జూన్ 12: చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వరలక్ష్మి అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం జరిగిన న్యాయ విఙ్ఞన సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసమాజంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలపై అందరూ అవగాహన కలిగి మెలగాలన్నారు. 14 ఏళ్ళలోపు బాల బాలికలను విధిగా చదివించాలన్నారు. అలా కాకుండా వారిని పనులకు పంపినట్లైతే బాలకార్మికులుగా మారతారని బాల కార్మికుల హక్కుల చట్టం కింద సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. మహిళల హక్కులు, విధులు, బాధ్యతలు, చట్టాలు తెలుసుకోవాలన్నారు. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల్యవివాహాల గురించి వివరించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ, మైలవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఏంబియే మాజీ అధ్యక్షులు ఎం ఆంజనేయులు, ఏజిపి పి రామకృష్ణ, మాజీ అధ్యక్షులు బి వెంకట్రావ్, న్యాయవాదులు కిషోర్, సామాజిక హక్కుల నాయకులు దాసు పాల్గొన్నారు.

నేలకొరిగిన వృక్షాలు!
కూచిపూడి, జూన్ 12: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి మొవ్వ మండలంలో మంగళవారం భారీ వృక్షాలు నెలకొరిగాయి. వృక్షాలు నెలకొరగటంతో ఐఎన్‌కె ఆర్‌అండ్‌బీ రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. మరొక లారీ బురదలో కూరుకుపోయింది. దీంతో పామర్రు నుండి అవనిగడ్డ వెళ్లాల్సిన వాహనాలు అయ్యంకి నుండి పెడసనగల్లు, కూచిపూడి మీదుగా మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్ రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్దీకరణకు కృషి చేశారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలో 28.8మి.మీల వర్షపాతం కురిసినట్లు తహశీల్దార్ బి రామానాయక్ తెలిపారు.