కృష్ణ

సుబాబుల్ పంచాయతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, జూన్ 12: సుబాబుల్ కర్ర విక్రయాలకు సంబంధించిన పంచాయతీలో పెద్దఎత్తున అధికార, ప్రతిపక్షనాయకులు, కార్యకర్తలు రంగప్రవేశం చేయడంతో స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయంలోకి వస్తే చందర్లపాడు మండలం ముప్పాళ్ల నుండి సుబాబుల్ లోడ్‌తో జగ్గయ్యపేట వైపు వెళుతున్న రెండు ట్రాక్టర్‌లను చందాపురం బైపాస్ వద్ద మార్కెట్‌కమిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆర్‌సీ ద్వారా సుబాబుల్ కర్ర తరలించడానికి వీలులేదంటూ ట్రాక్టర్‌లను నిలుపుదల చేయడంతో సదరు రైతులు, మార్కెట్ కమిటీ సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో రైతులు ట్రాక్టర్‌లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి సుబాబుల్ ట్రాక్టర్‌లను స్టేషన్‌కు తరలించారు. సుబాబుల్ రైతుల పక్షాన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పలువురు నేతలు, కార్యకర్తలతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఎటువంటి సెస్ చెల్లించకుండానే ఎక్కడైనా విక్రయించుకునే హక్కు ఉండగా మార్కెట్‌కమిటీ సిబ్బంది అడ్డుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌కమిటీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు తెడీపీ నాయకులతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ముప్పాళ్లకు చెందిన వ్యాపారి సుబాబుల్ కర్రను రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆర్‌సీ ద్వారా తరలిస్తుండగా అడ్డుకున్నందుకు మార్కెట్‌కమిటీ సిబ్బందిపై దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదు చేసారు. రైతులపైనే మార్కెట్‌కమిటీ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహనరావు పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే నేతల మధ్య వాగ్వివాదం జరగడంతో ఎస్‌ఐ సురేష్ సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పెద్దఎత్తున వైకాపా, తెదేపా శ్రేణులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేసే ఆర్‌సీ వ్యాపారులకు వైకాపా కొమ్ముకాస్తోందని ఏఎంసీ చైర్మన్ చిరుమామిళ్ల ఆరోపించారు. మార్కెట్‌కమిటీ ద్వారానే ఈ సుబాబుల్ కర్రను కొనుగోలు చేయడం జరుగుతుందని ఏఎంసీ కార్యదర్శి గోవిందు తెలియజేయడంతో ట్రాక్టర్‌లను తరలించారు. పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న పార్టీల శ్రేణులను పోలీసులు పంపించి వేశారు.

అంధత్వ నిర్మూలనకు సహకరించండి
మైలవరం, జూన్ 12: సామాజిక అంధత్వ నిర్మూలనకు అందరూ సహకరించాలని కెమ్‌టెక్ కంపెనీ నిర్వాహకులు శ్రీకృష్ణ అన్నారు. మంగళవారం ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో కెమ్‌టెక్ సంస్థ సహకారంతో మండలంలోని పుల్లూరు బేతెస్థ చర్చిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈశిబిరం నందు సుమారు 125 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అందులో 35 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి వారికి విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలో ఉచితంగా చికిత్సలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా లయన్స్‌క్లబ్ ఆఫ్ మైలవరం నిర్వాహకులు ఎస్వీ సుధాకరరావు నేతృత్వంలో కొనసాగుతున్న ఎల్వీ ప్రసాద్ ఉచిత కంటి పరీక్షా కేంద్రం సిబ్బందితో శిబిరాన్ని ఏర్పాటు చేసి కంటి రోగులు పరీక్షించారు. ఈశిబిరంలో సిబ్బంది, ఎస్‌కే మహాబీ, ఫీల్డ్ అసిస్టెంట్ రాణి, విజయవాడ విజిన్ సెంటర్ కోఆర్డినేటర్ నరేష్, చర్చి ఫాస్టర్ నతానియేలు తదితరులు పాల్గొన్నారు.