కృష్ణ

చర్చకు వస్తే అరెస్టు చేస్తారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, జూన్ 12: అర్బన్ హౌసింగ్ విషయంలో అవినీతి విషయమై ఓ న్యూస్‌ఛానల్‌లో బహిరంగ చర్చకు సవాల్ విసిరిన శాసనమండలి సభ్యుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు విష్ణువర్ధనరెడ్డికి, ఎమ్మెల్సీ రాజేంద్రకు అర్బన్ హౌసింగ్ విషయంలో ఓ టీవీ ఛానల్‌లో సోమవారం చర్చ జరిగింది. ఈ పథకంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రెడ్డి ఆరోపించడం, దానిపై ఉయ్యూరులో బహిరంగ చర్చకు రాజేంద్ర సవాల్ విసరడం వివాదాస్పదమైంది. స్థానిక జెమినీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న జి+3 హౌసింగ్ ప్రాంగణంలో చర్చా వేదికకు ఇరువురు నేతలు సన్నద్ధమయ్యారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో చర్చకు నాయకులు కార్యకర్తలు వెంట రాగా రాజేంద్ర ప్రాంగణానికి విచ్చేసారు. అక్కడే ఉన్న కాంట్రాక్టర్‌ను, మేనేజర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈలోగా విష్ణువర్ధనరెడ్డిని కంకిపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం అందింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు స్థానికంగా మోహరించారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నట్లు పోలీసులు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోవలసినదిగా తెలుగుదేశం నాయకులకు, రాజేంద్రకు సూచించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని, తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాజేంద్ర పట్టబట్టడంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టణ పోలీస్టేషన్‌కు తరలించారు. ఒకానొక సమయంలో రాజేంద్ర పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. కాగా రాజేంద్ర అరెస్టును నిరసిస్తూ దేశం నాయకులు పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసారు. మధ్యాహ్నం వరకు స్టేషన్‌లోనే రాజేంద్రను ఉంచిన పోలీసులు అనంతరం విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో సీడీసీ, ఎంఎంసీ, మున్సిపల్ చైర్మన్‌లు భీమవరపు పిచ్చిరెడ్డి, అబుల్ కలాం, జంపాన పూర్ణచంద్రరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

చర్చను అడ్డుకోవడం ద్వారా
అవినీతిని అంగీకరించారు
కమలదళం స్పష్టీకరణ
ఉయ్యూరు, జూన్ 12: గృహ నిర్మాణాలలో జరుగుతున్న అవినీతిపై తమ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డితో బహిరంగ చర్చకు సవాల్ విసిరిన ఎంఎల్‌సీ రాజేంద్ర పోలీసుల ద్వారా చర్చను అడ్డుకోవం వల్ల అవినీతిని అంగీకరించనట్లయిందని భారతీయ జనతాపార్టీ నాయకులు ఓ ప్రకటనలో ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు సవాల్ విసరడం, అనంతరం వెనక్కి తగ్గడం, పోలీసులతో అరెస్టు చేయించడం పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. గతంలో మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్, వైసీపీ శాసనసభ్యురాలు రోజా విషయంలోనూ ఇదే తరహాలో వారు వ్యవహరించడం అందుకు నిదర్శనమని వివరించారు. చర్చలో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోలీసులను వాడుకోవడం పరిపాటిగా మారిందన్నారు. ఇటీవల సినీరంగం వారిని విమర్శించి అభాసుపాలైన రాజేంద్ర అవగాహన లోపంతో మరో తప్పిదం చేసారని, ప్రజల నుండి అభివృద్ధి పేరుతో ఎక్కువ మొత్తంలో నిధులు వసూలు చేస్తున్నట్లు అంగీకరించారని వివరించారు. కాగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పలు అవినీతి అక్రమ కార్యకలాపాలను బీజేపీ ప్రజల ముందుంచుతుందని రూరల్ పార్టీ అధ్యక్షులు వల్లూరుపల్లి మురళీకృష్ణ, తోట్లవల్లూరు పార్టీ అధ్యక్షులు మోర్ల అంక శ్రీనివాసరావు, పట్టణ పార్టీ ఉపాధ్యక్ష, కార్యదర్శులు కళ్ళం శేషిరెడ్డి, ఆదిరాజు సర్వేశ్వరరావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.