కృష్ణ

అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 4: అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారం ఆయన హుటాహుటిన మచిలీపట్నం వచ్చారు. పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్ళి ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాపు సోదరులంతా సయమనం పాటించాలని, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దోషులు ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కొన్ని అరాచక శక్తులు ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్ధ రాజకీయాల కోసం ఇటువంటి చర్యలకు పాల్పడి ప్రజలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. కాపులతో పాటు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దోషులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారన్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రంగా విగ్రహ ధ్వంసం వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. స్వార్ధ రాజకీయ పరుల కుట్రపూరిత చర్యలను ఎదుర్కొంటామన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులకు చరమగీతం పాడతామన్నారు. కాపులంతా ప్రభుత్వానికి దగ్గరవుతుండటాన్ని చూసి ఓర్వ లేకే కొంత మంది ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులపై, సెల్‌టవర్లపై
కౌన్సిల్‌లో రసవత్తర చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 4: సెల్‌టవర్ల ద్వారా పలు కంపెనీలు భారీస్థాయిలో వ్యాపారాలు సాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ తమ సెల్‌టవర్లను ఏర్పాటు చేసుకున్నందులకు గాను నగరపాలక సంస్థకు నామమాత్రంగానే రుసుం చెల్లిస్తున్నారంటూ నగర మేయ ర్ కోనేరు శ్రీ్ధర్‌తో పాటు సభ్యులు సిద్దెం నాగేంద్రరెడ్డి, పుణ్యశీల తదితరులు ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల్లో ఈ విషయాన్ని నాగేంద్రరెడ్డి ప్రస్తావించగా వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన 321 సెల్‌టవర్లు, 35 యాంటెన్న పోల్స్ ప్రైవేట్, నగరపాలక సంస్థ ఆస్తులపై ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం కొత్త టవర్ ఏర్పాటుకు 25వేలు.. ఆపై ప్రతి ఏటా రెన్యువల్ ఫీజు కింద ఆరువేలు చెల్లించాల్సి వుందన్నారు. అయితే ప్రభుత్వం 2013 ఆగస్టు నుంచి సెల్‌టవర్ ఏర్పాటుకు లక్ష రూపాయలు వ సూలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే కొన్ని కంపెనీలు రెన్యువల్ ఫీజు చెల్లించకుండా కోర్టుల్లో దావాలు వేసి ఉన్నాయన్నారు. మేయర్ కల్పించుకుంటూ ప్రైవేట్ భవనాల యజమానులు లక్షల్లో అడ్వాన్స్‌లు, గుడ్‌విల్స్ నెలవారీ అద్దెలు తీసుకుంటుంటే నగరపాలక సంస్థకు నెలకు ముష్టి రూ.200లు మాత్రమే చెల్లిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారంటూ ఆగ్రహించారు. పైగా టవర్ల కింద జనరేటర్ల కోసం స్థలాన్ని కూడా వాడుకుంటున్నారన్నారు. నిషిద్ధ వాటర్ ట్యాంక్‌లపై సెల్ టవర్లకు ఎలా అనుమతిచ్చారంటూ అధికారపక్ష సభ్యులు ముప్పా వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. ముక్కుముఖం తెలియని వారెవరో రోజూ వాటర్ ట్యాంక్ ఎక్కి రిపేర్లు చేస్తుంటారు. ఆ సమయంలో ఏదైనా విష పదార్థం కలిపితే ప్రజల పరిస్థితి ఏమిటని ఆవేశంతో ప్రశ్నించారు. మేయర్ శ్రీ్ధర్ దీన్ని సమర్థిస్తూ అసలు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. వాటర్ ట్యాంక్‌లపై దాదాపు 18 టవర్స్ ఉన్నాయన్నారు. దీనిపై ఎస్‌ఐ షుకూర్ బదులిస్తూ వాటర్ ట్యాంక్‌లపై టవర్లు నిషేధమేనంటూ ఇటీవల కాలంలో అనుమతివ్వటం లేదని దశలవారీగా అన్నింటినీ తొలగిస్తామంటూ హామీ నిచ్చారు.
మరో అంశంపై సిద్దెం నాగేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పురాతన భవనాలను కార్పొరేషన్ అధికారులు పరిశీలిస్తూ మరమ్మతులు చేసుకోవాలని లేదా కూల్చివేయాలంటూ నోటీస్‌లు జారీ చేస్తున్నారు బాగుంది. అయితే 54 ఏళ్ల క్రితం నిర్మితమైన వస్తల్రత భశన పటుత్వ పరీక్షను ఒక్కసారైనా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించగా మేయర్ కల్పించుకుంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదాయన్నారు. అందులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, ఆక్రమణలు పెరిగాయని ఒక దుకాణాన్ని రెండుగా ఏర్పాటు చేసుకుని ఒక అద్దె చెల్లిస్తున్నారని నాగేంద్రరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నాయకురాలు పుణ్యశీల మాట్లాడుతూ ఒరిజినల్ ప్లాన్ చేతబట్టి ప్రస్తుత వాస్తవిక పరిస్థితులను గుర్తించి కౌన్సిల్ ముందుంచాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తుంటే యుసిడి విభాగం నిర్లక్ష్యం కారణంగా అనేకానేక తప్పులు దొర్లుతూ ఒకరి పెన్షన్ మరో ఖాతాలోకి చేరుతున్నాయని, మరికొందరికి నెలల తరబడి పెన్షన్ రావటం లేదంటూ డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, కార్పొరేటర్ గండూరి మహేష్ తదితరులు ధ్వజమెత్తారు. పెన్షన్ల కోసం వృద్ధులు తమ కార్యాలయాల చుట్టూ తమను తిట్టుకుంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఈ అంశంపై మాట్లాడారు.