కృష్ణ

రెండో రోజూ జల్లెడ పట్టిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 11: అనుమానితులు, నేరస్తులను జల్లెడ పట్టే క్రమంలో రెండోరోజూ కూడా నగరంలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ కొనసాగింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు పోలీస్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సింగ్‌నగర్, కృష్ణలంక పోలీస్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఈ తనిఖీలు నిర్వహించారు. తొలిరోజు మంగళవారం మాచవరం పోలీస్టేషన్ పరిధిలోని మొగల్రాజపురం కొండ ప్రాంతంలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని కొనసాగింపుగా నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో బుధవారం సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. కృష్ణలంక పోలీస్టేషన్ పరిధిలోని రాణిగారితోట, భూషేష్‌గుప్తానగర్, కరకట్ట ప్రాంతాలను పోలీసు బలగాలు అష్టదిగ్భంధనం చేశాయి. సౌత్ ఏసిపి శ్రీనివాసరావు, ఈస్ట్ ఏసిపి బి విజయభాస్కర్ నేతృత్వంలో గవర్నర్‌పేట సిఐ శ్రీనివాస్, ఎనిమిది మంది ఎస్‌ఐలు, 16మంది హెడ్ కానిస్టేబుళ్లు, 38మంది కానిస్టేబుళ్లు, నలుగురు మహిళా కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులతోపాటు రిజర్వు పోలీసు బలగాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని ఒకే సమయంలో తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మార్గాలను మూసివేసి ఓ బృందం వాహనాలు తనిఖీ చేయగా, మరో బృందం ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. 212 వాహనాలను అదుపులోకి తీసుకుని చెకింగ్ చేసి అనుమానాస్పదంగా గోచరించిన 29 వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా 550 ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. 35మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన మీదట ఐదుగురు వ్యక్తులను కస్టడీకి తరలించారు.
అదేవిధంగా అజిత్ సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ ఏసిపి సత్యానందం, నార్త్ ఏసిపి శ్రావణి నేతృత్వంలో సత్యనారాయణపురం సిఐ సత్యనారాయణ, నున్న రూరల్ సిఐ సహేరా, అజిత్ సింగ్‌నగర్ సిఐ బాల మురళీకృష్ణలతోపాటు పది మంది ఎస్‌ఐలు, సిబ్బంది, రిజర్వు బలగాలు తనిఖీలు నిర్వహించి 110మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాత నేరస్తులు, అనుమానితులు ఉన్నట్లు ఏసిపి సత్యానందం తెలిపారు. అనుమానితులకు ఐరిష్ నిర్వహించామని, అదేవిధంగా పెద్ద ఎత్తున వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. రెండు రోజులుగా కొనసాగుతున్న కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు ఇక మీదట తరచూ కొనసాగనున్నాయి.

న్యూ రాజరాజేశ్వరిపేటలో
పాయకాపురం, మే 11: ఇటీవల మొగల్రాజపురంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుండి న్యూ రాజరాజేశ్వరిపేటకు అనేక వంద కుటుంబాలని తరలించటంతోపాటు ఇక్కడ అత్యధికంగా అసాంఘిక శక్తులు ఉన్నట్లుగా పోలీసుల నిఘాలో తేలింది. ఇటీవల జరిగిన ఘటనలో ఇక్కడ కొంతమందికి కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిసిన నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు కొండ ప్రాంతాల మీద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులే అక్కడ రౌటీయిజం చేస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పోలీసులు న్యూరాజరాజేశ్వరిపేటలో ఆకస్మికంగా కార్డన్ సర్చ్‌ను బుధవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 19 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా సరైన ధృవీకరణ పత్రాలులేని 21 వాహనాలను సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కార్డన్ సర్చ్‌లో నార్త్‌జోన్ ఎసిపి శ్రావణి, మరో ఎసిపి సత్యానందం, టాస్క్ఫోర్స్ ఎసిపితోపాటు అజిత్‌సింగ్‌నగర్ సిఐ బాల మురళీకృష్ణ, సత్యనారాయణపురం సిఐ సత్యనారాయణ, నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ సిఐ సహేరాబేగంతోపాటు 10 మంది ఎస్‌ఐలు, 80 మంది కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.