కృష్ణ

ఎకరానికి రూ.35లక్షలు ఇస్తే ‘పోర్టు’కు భూములిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 9: భూమి కొనుగోలు పథకం కింద ఎకరానికి రూ.35లక్షలు చెల్లించి బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములు తీసుకోవాలని పోర్టు ప్రతిపాదిత గ్రామ రైతులు స్పష్టం చేశారు. భూమి కొనుగోలు పథకానికి సంబంధించి కలెక్టర్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం రాత్రి ముడ కార్యాలయంలో రైతులతో సమావేశమైంది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం హాజరై ధర నిర్ణయంపై రైతుల అభిప్రాయాలు సేకరించారు. చాలా మంది రైతులు తాము పోర్టుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే ఎకరానికి రూ.35లక్షలు పరిహారం ఇవ్వాలని కమిటీ ముందు చెప్పడం విశేషం. ఇప్పటికే రూ.22లక్షలు ఇచ్చేందుకు ఒక నిర్ణయానికి వచ్చిన కమిటీ మరో రూ.3లక్షలు పెంచుతూ రూ.25లక్షలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి ఎకరానికి రూ.25లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ లక్ష్మీకాంతం హామీ ఇచ్చారు. అయితే కొంత మంది రైతులు మాత్రం రూ.35లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రైతులు స్వచ్చందంగా పోర్టు నిర్మాణానికి ముందుకు రావాలని మంత్రి రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకీ వెనుకబడుతున్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు పోర్టు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రైతులంతా పెద్ద మనస్సు చేసుకోవాలని వారు సూచించారు. ఈ సమావేశంలో ముడ వైస్ చైర్మన్ విల్సన్‌బాబు, జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ వినియోగదారుల ఖాతాల్లో విధిగా సబ్సిడీ మొత్తం జమ చేయాలి
* అధికారులను ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీకాంతం
మచిలీపట్నం, జూలై 9: జిల్లాలో ప్రతి ఒక్క వంట గ్యాస్ వినియోగదారునికి బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తాలు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన బంగ్లాలో గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొంత మంది గ్యాస్ వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ మొత్తాలు పడటం లేదన్న ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించారు. అటువంటి ఇబ్బందులను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఖాతాదారుల్లో కొంత మంది వేరొక బ్యాంక్‌కు ఖాతాలు మార్చడం, బ్యాంక్ ఖాతాను ఆరు నెలల పాటు నిర్వహించకపోవడం వంటి కారణాల వల్ల ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుందని డీలర్లు కలెక్టర్‌కు వివరించారు. వినియోగదారులు తమ ఖాతాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆధార్‌తో అనుసంధానం చేసినట్లైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనిపై వినియోగదారుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు, డీఐఓ శర్మ తదితరులు పాల్గొన్నారు.