కృష్ణ

జీవితంలో వెలుగును, అజ్ఞానాన్ని పారద్రోలేది విద్యే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జూలై 9: మానవ జీవితంలో వెలుగు నింపేది...అజ్ఞానాన్ని పారద్రోలేది...విద్యే అని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం గన్నవరం విఎస్ సెయింట్ జాన్స్ హైస్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. సభకు పాఠశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ బాలశౌరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు తన సందేశంలో సెయింట్ జాన్స్ హైస్కూల్ గడిచిన 50 ఏళ్ల కాలంలో విద్యార్థులకు విజ్ఞానం అనే సౌధానికి ఎంత పునాది వేసిందో ఊహించుకుంటున్నానన్నారు. గాబ్రియేల్ బ్రదర్స్, వౌంట్‌ఫోర్డ్ బ్రదర్స్ 32 దేశాల్లో విద్యావ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు. 1969లో పూరిపాకలో స్థాపించిన ఈ విద్యాసంస్థ జూవిఎస్ నుండి బాలశౌరి వరకూ వటవృక్షంలా ఎదిగిందని కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా, విలువలతో కూడిన విద్యను అందించడం అభినందనీయమని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు విలువ ఇస్తూ, మన ఆట, మాట, పాటలకు అద్దంపడుతుందని అన్నారు. మన కట్టు, బొట్టు కళ్లకు కట్టినట్లు విద్యార్థులు ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. అలాగే వెంకయ్యనాయుడు తన చిన్నతనంలో చదువుకోసం పడిన కష్టాన్ని, ఇబ్బందుల్ని అక్కడి విద్యార్థులకు తెలిపారు. బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లినా కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, గురువును మరువరాదని విద్యార్థులకు హితవు పలికారు. ఇంగ్లీష్, హిందీ వంటి ఎన్ని భాషలు నేర్చినా తెలుగుభాషను మర్చిపోకూడదని అన్నారు. అమ్మభాష కళ్లు అని, పరాయి భాష కళ్లజోడులాంటిదని వివరించారు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకోండి, కానీ అమ్మభాషను మరువవద్దని స్పష్టం చేశారు. ఎంతో పవిత్రమైన జాతి భారతజాతి అని, కులం, మతం, ప్రాంతం ఏదైనా మన సంస్కృతి ఒక్కటే అని అన్నారు. మతం వ్యక్తిగతం అని, ‘హిందూ’ అనేది మతం కాదని, అది జీవనవిధానం అని అన్నారు. విద్య విజ్ఞానం కోసం అన్నారు. ప్రకృతిని ప్రేమించాలని, సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారుర. భారతదేశంలో కృష్ణాజిల్లా ప్రజలు ఎక్కువ తెలివిగలవారని, దేశాన్ని శక్తివంతమైన దేశంగా రూపొందించాలని వెంకయ్యనాయుడు సూచించారు. స్వర్ణోత్సవ కానుకగా ప్లస్ వన్, ప్లస్ టు తరగతుల శిలాఫలకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. విజయవాడ బిషప్ జోసెఫ్ రాజారావు వెంకయ్యనాయుడిని దుశ్శాలువాతో సత్కరించారు. పాఠశాల ప్రాంగణంలో ఎంతో చారిత్రాత్మకంగా నిర్మించిన ‘హెరిటేజ్ పార్క్’ను వెంకయ్యనాయుడు విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆహూతులకు పాఠశాల తరఫున ప్రిన్సిపాల్ బాలశౌరి ఇచ్చిన ‘స్వర్ణజ్ఞాపికలు’ వెంకయ్యనాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖా మంత్రి కొల్లు రవీంద్ర, విశాఖపట్టణం ఎంపీ ఎం.హరిబాబు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం ఆహ్వానించిన వారిలో ఉన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి.రవికుమార్, బి.నరేంద్ర, సభ్యులు కాకాని పద్మజ, కె.వాసుదేవ్. బి.సుభాకర్, వై.హరివిశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్నవరం సీఐ శ్రీ్ధర్‌కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.