కృష్ణ

వాస్తవాలను వక్రీకరిస్తున్న ‘కన్నా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 9: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేస్తున్న విమర్శలు వాస్తవ విరుద్ధమని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రవీంద్ర మండిపడ్డారు. బందరు ఓడరేవు నిర్మాణానికి లక్షల ఎకరాలు భూమి తీసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూదాహానికి పాల్పడుతున్నారంటూ లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలపై మంత్రి రవీంద్ర తీవ్రంగా స్పందించారు. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 యేళ్లు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ బందరు పోర్టుపై పెదవి విప్పలేదన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన లక్షలాది ఎకరాల భూ కుంభకోణాలను ప్రత్యక్షంగా చూసిన లక్ష్మీ నారాయణ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన భూ కుంభకోణాలకు కేంద్ర బింధువుగా లక్ష్మీనారాయణ వ్యవహరించారన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా లక్ష్మీ నారాయణ వేలాది ఎకరాల భూములను తమ అనుయాయులకు కట్టబెట్టిన విషయాన్ని మరచిపోతున్నారన్నారు. వాన్‌పిక్, బ్రహ్మణి స్టీల్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, బయ్యారం ఘనులు, రక్షణ స్టీల్స్, వివి మినరల్స్, సరస్వతి పవర్, కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్, రస్ ఆల్ ఖైమాకు బీచ్ శాంతి పేరుతో భూములు దోచి పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. వెనుకబడిన మచిలీపట్నంలో ఓడరేవు, అనుబంధ పరిశ్రమల కోసం 14వేల ఎకరాల పట్టా భూములకు మాత్రమే పూలింగ్ నోటిఫికేషన్‌ను తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అది కూడా రైతుల నుండి అయిష్టత రావటంతో అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం జారీ చేసిన 12వేల ఎకరాల భూములకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డీనైట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్న తరుణంలో పోర్టుకు లక్షలాది ఎకరాలు తీసుకుంటున్నారంటూ కన్నా చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధం కాదా అని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు. కేవలం బందరు ఓడరేవుకు సంబంధించిన 5వేల 300 ఎకరాల్లో 2వేల 300 ఎకరాల పట్టా భూములను మాత్రమే భూమి కొనుగోలు పథకం ద్వారా తీసుకోవడం జరుగుతుందని మంత్రి రవీంద్ర తెలియచేశారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

పట్టాలెక్కనున్న ఇంటింటికి కుళాయి ప్రాజెక్ట్
* రూ.984కోట్లతో 1382 పనులు
* పూర్తయిన టెండర్ల ప్రక్రియ
* ఆగస్టులో పనులు ప్రారంభం
* వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వెల్లడి
మచిలీపట్నం, జూలై 9: జిల్లాలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రూ.984కోట్లతో ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రాజెక్టు రూపకల్పనకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు ఆగస్టు 1వ తేదీన పట్టాలెక్కనుంది. ఇందుకు సంబంధించిన సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం సోమవారం మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. ఆగస్టు 1వతేదీ నుండి ఇంటింటికి కుళాయికు సంబంధించిన పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రూ.984కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద 1382 పనులు నిర్వహించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. పనుల ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేయాలని సంబంధిత జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. జిల్లాలో లక్ష ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన నివేదికలు సైతం సత్వరమే పంపించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కోటి మొక్కల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో పార్కులు, గోకులాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్కుల కోసం 50 సెంట్ల భూమి, గోకులం కోసం 25 సెంట్ల భూమి, గ్రామ చవిడిలు ఏర్పాటుకు 12 సెంట్ల భూమిని సిద్ధం చేయాలని తహశీల్దార్లకు సూచించారు. వర్షా కాలం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, ముడ వీసీ విల్సన్‌బాబు, ఇన్‌ఛార్జ్ డీపీఓ ఆనంద బాబు, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.