కృష్ణ

నిండామునిగిన పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూలై 12: ఒక ఎన్నారై స్వార్థం తమకు శాపంగా మారిందని మండలంలోని చండ్రగూడెం శివారు సబ్జపాడు గ్రామ రైతులు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం నీరు తమ పంట పొలాలను ఆసాంతం ముంచివేయటంతోపాటు సమీపంలో ఉన్న గ్రామంలోని ఇళ్ళను సైతం ముంచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే సబ్జపాడు గ్రామానికి చెందిన రైతుల భూములకు గత రెండేళ్ళుగా వర్షాకాలంలో వరద ముంపు ముంచుకొస్తోంది. వర్షం కురిసిన సమయంలో ఎగువ నుండి వచ్చే వరద నీరు దిగువకు వెళ్ళి సమీపంలోని బుడమేరు కాలువలో కలిసేది. రెండేళ్ళ క్రితం వెల్వడం గ్రామానికి చెందిన ఒక ఎన్నారై సబ్జపాడు రైతుల పొలాలకు దిగువన భూమిని కొనుగోలు చేసి అందులో ఒక విద్యా సంస్థను నెలకొల్పాలని నిర్ణయించి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నారు. కొనుగోలు చేసిన పొలం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారు. దీంతో సమస్య మొదలైంది. ఎగువ నుండి వచ్చే వరద నీటిని దిగువనున్న బుడమేరులోకి వెళ్ళనీయకుండా ప్రహరీ అడ్డుకుంటోంది. దీంతో వరద నీరు ప్రహరీకి ఎగువనున్న పంట పొలాలను ముంచేస్తోంది. దాదాపు 50 ఎకరాల పంట వర్షం వచ్చిన ప్రతిసారీ మునిగిపోతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద ఆసాంతం ఎగదన్ని పంట పొలాలను ముంచేసింది. ఈ వరద అంతటితో ఆగకుండా మరింత ఉధృతమై సమీపంలోని గ్రామాన్ని తాకింది. సబ్జపాడు హరిజనవాడలోని ఇళ్ళలోకి ప్రవేశించి ఇళ్ళు పడిపోయే దశలోకి వచ్చాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రైతులు ఈ పొలాల్లో పత్తి పైరు వేసుకున్నారు. ఎకరాకు ఇప్పటికే సుమారు 20 వేల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టారు. ఈ వరద కారణంగా వేసిన పైరు నీట మునిగి పనికి రాకుండా పోతుందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. వర్షం వల్ల వస్తున్న వరద నీటితో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఇప్పటికి పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కావటం లేదని వారు ఆరోపిస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని, వరద నీరు దిగువకు పోయే మార్గం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయం చూపిన తహశీల్దార్
కాగా, రైతుల పంట పొలాలకు మునకకు కారణమైన ప్రహరీగోడ వద్ద నీటి మళ్ళింపునకు తహశీల్దార్ పి పుల్లయ్య ప్రత్యామ్నాయం చూపి నీటిని మళ్ళించారు. రెండేళ్ళుగా ఉన్న ఈ సమస్యను నూతనంగా బదిలీపై ఇక్కడికి వచ్చిన తహశీల్దార్ పుల్లయ్య గురువారం ఎట్టకేలకు పరిష్కరించారు. పంట పొలాల ముంపు సమస్య గురించి తెలసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించి తహశీల్దార్‌కు సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేయగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తహశీల్దార్ వెంటనే అక్కడికి చేరుకుని సిబ్బంది సాయంతో వరద నీటిని ప్రత్యేక తూరల ద్వారా దిగువకు మళ్ళించటంతో నీటిలో మునిగిపోయిన పంట పొలాల రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

వైసీపీ బలోపేతమే లక్ష్యం
* వసంత కృష్ణ ప్రసాద్
జి.కొండూరు, జూలై 12: వైసీపీని మరింత బలోపేతం చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని హెచ్ ముత్యాలంపాడు, కందులపాడు, వెల్లటూరు, పినపాక, ఆత్కూరు, చిననందిగామ గ్రామాల్లో గురువారం వైసీపీ గ్రామస్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో వసంత మాట్లాడుతూ అందరూ ఐకమత్యంతో ఉండి పార్టీ అభ్యునతి కోసం శ్రమించాలన్నారు. కష్టపడిన కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలు సాధించడానికి జగన్‌ను సిఎం చేద్దామన్నారు. ఓటమి భయంతోనే మంత్రి ఉమ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నాడన్నారు. గడచిన నాలుగేళ్ళలో అవినీతికి పాల్పడి బాగా సంపాందిచారన్నారు. తాను మాత్రం కష్టపడిన సొమ్ముతోనే రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సహాయం చేస్తున్నానన్నారు. చెవిటికల్లులో భూములు కబ్జా కాకుండా తాను కాపాడితే, తనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎవరేమిటో తెలుసన్నారు. రానున్న ఎన్నికల్లో మైలవరంలో వైసీపీ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ తిరుపతిరావు, జెడ్పీటీసీ కాజ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.