కృష్ణ

విద్యార్థి దశ నుంచే వ్యక్తిత్వ వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జూలై 12: విద్యార్థినీ విద్యార్థులు విద్యాభ్యాసం దశ నుంచే తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలో గురువారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ పేరుతో 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. సమాజ భద్రత కొరకే చట్టాలు ఏర్పడ్డాయని, ఆ చట్టాలను గౌరవించడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఉప సభాపతి కోరారు. పోలీసు వారిని రక్షకబటులుగా భావించాలన్నారు. దేశంలో పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నా అత్యుత్తమ ఫలితాలు సాధించిన కారణంగానే ఈ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. దృశ్య శ్రవణ యంత్రాలను అందించిందని బుద్ధప్రసాద్ వెల్లడించారు. డీఎస్పీ పోతురాజు మాట్లాడుతూ దేశంలో 14,131 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఉత్తమ ఫలితాల సాధనలో ముందున్న పాఠశాలల సరసన నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల చేరిన కారణంగానే రూ.2లక్షల 50వేలు విలువ గల దృశ్య శ్రవణ యంత్రాలను కేంద్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా భావి భారత పౌరులుగా అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని పోతురాజు కోరారు. అవనిగడ్డ సీఐ ఎస్‌వివిఎస్ మూర్తి సదస్సును ప్రారంభిస్తూ 25 సంవత్సరాల క్రితం నేర సీమగా భావించిన దివిసీమ ఆ తదుపరి విద్యా వ్యాప్తిలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

‘లోక్ అదాలత్’లో జిల్లా ఫస్ట్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు
మచిలీపట్నం, జూలై 12: జాతీయ లోక్ ఆదాలత్ కేసుల పరిష్కారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాజిల్లానే ప్రథమ స్థానంలో నిలుస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత లోక్ అదాలత్‌ల స్ఫూర్తితో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 11 మండల న్యాయ సేవాధికార సంస్థల పరిధిలో లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థలతో పాటు జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా న్యాయస్థానంలో లోక్ ఆదాలత్ నిర్వహణకు గాను ఆరు బెంచ్‌లు, విజయవాడలో 16 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మే నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 57వేల 227 కేసులు పెండింగ్‌లో ఉండగా వీటిలో 8వేల 411 కేసులను రాజీ మార్గాన పరిష్కరించేవిగా గుర్తించినట్లు తెలిపారు. 14వ తేదీన నిర్వహించే లోక్ ఆదాలత్‌లో 3వేల 100 కేసులను పరిష్కరించాలని నిర్ణయించినట్లు వివరించారు. జిల్లాలో పర్మినెంట్ లోక్ ఆదాలత్ కోర్టు ఆవరణలో న్యాయ సేవాసదన్ పని చేస్తుందని, ఎలాంటి ఫీజు లేకుండా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. వినియోగదారుల ఫోరంలో వేసే కేసులు కూడా ఇక్కడ పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ పాల్గొన్నారు.