కృష్ణ

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూలై 14: మండలంలోని కానూరు, వణుకూరుకు చెందిన పోలింగ్ కేంద్రాల కన్వీనర్లతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కన్వీనర్లు ప్రజలకు వివరించాలన్నారు. సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఆనంద్, ఎంపిటిసి ప్రభావతి, షేక్ బుజ్జి, దోనేపూడి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటడం బాధ్యత కావాలి
పాతబస్తీ, జూలై 14 : సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని పోషించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి, 40వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఆసిఫ్ అన్నారు. డివిజన్‌లోని మహమ్మదాలిపురం నగర పాలక సంస్థ పాఠశాల ప్రాంగణంలో జరిగిన వనం మనం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, కాలుష్య నివారణతో పాటు, పరిసరాల పరిశుభ్రత పాటిస్తామని ప్రతిన బూనాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నగరాజకుమారి, ఇన్‌చార్జి ఎం.వెంకటరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివరామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు.

పోరంకిలో వనం మనం
వనం మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు పచ్చదనం కోసం ఒక మొక్క నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం పిలుపు ఇచ్చారు. మండలంలోని పోరంకిలో 69వ వన మహోత్సవం పురస్కరించుకుని నాలుగు వరసల రహదారిగా విస్తరించిన మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి డివైడర్‌పై ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికీ తీవ్ర రూపం దాలుస్తున్న కాలుష్య భూతాన్ని ఎదుర్కోవాలన్నా, నీటి ఎద్దడి అధిగమించాలన్నా ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వేమూరి స్వరూపరాణి, ఉప సర్పంచ్ అనుమోలు ప్రభాకరరావు, వైస్ ఎంపిపి ఆనంద్, వల్లభనేని సత్యనారాయణ, ఆచంట వెంకటచంద్ర, మంచినేని పరమేష్, బొర్రా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఐక్య పోరాటాల ద్వారానే ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ సాధ్యం
* ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఈశ్వర్
విజయవాడ (కార్పొరేషన్), జూలై 14: వీఎంసీ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి సర్వీస్ క్రమబద్ధీకరణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏపీ జేఏసీ అమరావతి కృష్ణా జిల్లా చైర్మన్ డీ ఈశ్వర్ అన్నారు. వీఎంసీ ఎన్‌ఎంఆర్, ఫుల్‌టైమ్, పార్టుటైమ్, కంటింజెంట్ ఎంప్లారుూస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా ఆవిర్భావ సదస్సు శనివారం జరిగింది.