క్రైమ్/లీగల్

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, జూలై 14: ఇంట్లో అడిగినంత డబ్బివ్వలేదని మనస్తాపం చెందిన ఒక యువతి ఉరి వేసుకుంది. ఈ సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్‌నగర్ నందమూరి నగర్‌లో నివాసముంటున్న సింగంపల్లి వరలక్ష్మి గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎఎస్‌ఐగా పని చేస్తున్నారు. ఆమె భర్త సత్యనారాయణ గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్. వీరికి హారిక (22) అనే కుమార్తె ఉంది. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన హారిక కుటుంబ సభ్యులు తనను పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఉంది. తాను కాంపిటీటివ్ కోర్సు చదువుతానంటే ఇంట్లో వారు డబ్బులు ఇవ్వకపోవడంతో శుక్రవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుంది. ఉదయం ఎంతసేపు పిలిచినా తలుపులు తీయకపోడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టిన తల్లితండ్రులకు హారిక మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరిచారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బైక్, సెల్‌ఫోన్ల చోరీ కేసుల్లో ఏడుగురు అరెస్టు
విజయవాడ (క్రైం), జూలై 14: మోటారు సైకిళ్ళు, సెల్‌ఫోన్ల చోరీ కేసుల్లో ఏడుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు కేసుల్లో సుమారు 58 వేల రూపాయలు విలువైన నాలుగు సెల్‌ఫోన్లు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గవర్నర్‌పేట పోలీస్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో క్రైం డీసీపీ షిరీన్‌బేగం వివరాలు వెల్లడించారు. భవానీపురం హెచ్‌బి కాలనీకి చెందిన పాత నేరస్తుడు (22), రాజరాజేశ్వరిపేటకు చెందిన యువకుడు (19), ఎర్రకట్టకు చెందిన జువైనల్ (17), మరో 16 ఏళ్ల మైనర్, పెజ్జోనిపేటకు చెందిన 16 ఏళ్ల మైనర్, పటమటకు చెందిన 17 ఏళ్ళ జువైనల్, కృష్ణలంకకు చెందిన పాత నేరస్తుడు (20)ను అరెస్టు చేశారు. భవానీపురం పోలీస్టేషన్ పరిధిలో పార్కింగ్ చేసిన మోటారు సైకిళ్ళను గుర్తించి మారుతాళాలతో నిందితుడు చోరీకి పాల్పడ్డాడు. అదేవిధంగా సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో సెల్‌ఫోను మాట్లాడుకుంటూ వెళ్తున్న వారిని గమనించి బైక్‌పై వచ్చిన నిందితులు సెల్ లాక్కుని పరారయ్యారు. ఇదే మాదిరిగా మాచవరం, అజిత్‌సింగ్‌నగర్ పోలీస్టేషన్ల పరిధిలో కూడా ఆయా తరహా నేరాలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్న మీదట కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో సిసిఎస్ సిఐ కృష్ణంరాజు