కృష్ణ

ప్రకాశం బ్యారేజీ వద్ద పోటెత్తిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జూలై 14: రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరద నీటితో పోటెత్తింది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగులకు మించి వరద నీరు రావడంతో జల వనరుల శాఖాధికారులు శనివారం మధ్యాహ్నం 5 గేట్లు అడుగు మేర పైకి ఎత్తి 3,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గత నెల ఆఖరి వారంలో పొలాలకు సాగునీటిని భారీ నీటి పారుదల జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కృష్ణా డెల్టాకు విడుదల చేసిన విషయం విదితమే. ఇదిలా ఉండగా కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి 3,500 క్యూసెక్కుల నీరు అదనంగా చేరడంతో శనివారం ఉదయం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ నీటి సామర్ధ్యాన్ని మించి వరద పోటెత్తింది. దాంతో జల వనరుల శాఖాధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద 5 గేట్లు ఒక అడుగు మేర ఎత్తడంతో ప్రతి గేటు నుండి 700 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కృష్ణా నదికి వరద నీరు చేరడంతో జూరాల ప్రాజెక్ట్ నీటితో కళకళలాడింది. అక్కడ నుండి దిగువ ఆల్మట్టి నుండి వరద నీరు కిందకు వదిలితే శ్రీశైలం డ్యాం వద్ద వరద నీరు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 15 గంటలపాటు కృష్ణా నదికి వరద నీరు తాకిడి ఉండవచ్చని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరద ఉద్ధృతి చూసేందుకు నగర ప్రజలు తండోపతండాలుగా ప్రకాశం బ్యారేజీపైకి చేరుకున్నారు. జల వనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కేవీఎల్‌ఎస్‌పీ చౌదరి, అసిస్టెంట్ ఇంజనీర్ రాజా స్వరూప్, చీఫ్ ఇంజనీర్ సతీష్ తదితరుల పర్యవేక్షణలో వరద నీరు దిగువకు వదిలారు. నదీ పరీవాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు చెందిన గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జల వనరుల శాఖాధికారులు సూచిస్తున్నారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ 15 గంటల్లో వరద నీరు ఉద్ధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని తెలిపారు.

కల్తీ, నకిలీ తూకాలపై క్రిమినల్ చర్యలు : కలెక్టర్
విజయవాడ (క్రైం), జూలై 14: జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ, తప్పుడు తూకాలకు పాల్పడేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన వివిధ శాఖల విజిలెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గత వారం తనిఖీల నివేదికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార కల్తీకి సంబంధించి ఈ నెల 9వ తేదీ నుంచి 13 వరకు 69 ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని అన్నారు. 30 మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించామని, వాటిలో జగ్గయ్యపేటలో రెండు, మచిలీపట్నంలో రెండు షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నారని గుర్తించామని, వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. తూనికలు - కొలతలకు సంబంధించి ఈ వారంలో జిల్లాలో 121 కేసులు నమోదు చేసి రెండు లక్షల 74 వేల 988 రూపాయలు స్టాపింగ్ ఫీజుగాను, 5 లక్షల 42 వేల రూపాయలు కాంపౌండింగ్ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖ తనిఖీల్లో 24 వేల 131 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశామని, దాని విలువ 5 లక్షల 55 వేల 13 రూపాయలు ఉంటుందని, అదేవిధంగా 20 వేల ఎ64 రూపాయలు విలువైన 528 కేజీల పంచదార, 1296 రూపాయల విలువైన 27 కేజీల గోధుమ పిండి, 7809 రూపాయలు విలువైన 137 కిలోల కందిపప్పు, 16760 రూపాయలు విలువైన 419 లీటర్ల కిరోసిన్ ఈ తనిఖీల్లో సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా ఎక్సైజ్‌శాఖ తనిఖీల్లో 50 కేసులు నమోదు చేసి 53 మందిని అరెస్టు చేశామని, నమోదైన కేసుల్లో అనధికార మద్యం విక్రయాలకు సంబంధించి 44 కేసుల్లో 47 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.