కృష్ణ

బందరులో కాగడ కాంతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 9: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు సంబంధించి మచిలీపట్నం డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ (కాగడ గుర్తు) ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. డిపో పరిధిలో మొత్తం 306 ఓట్లు ఉండగా ఉండగా 301 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు ఓట్లు చెల్లలేదు. డిపోకు సంబంధించి ఎంప్లాయిస్ యూనియన్‌కు 147 ఓట్లు పోలవ్వగా నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 152 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఐదు ఓట్ల మెజార్టీతో నేషనల్ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. రాష్ట్రానికి సంబంధించి ఎంప్లాయిస్ యూనియన్ ఒక ఓటు మెజార్టీతో గెలుపొందింది. పోలైన 302 ఓట్లలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 149 ఓట్లు పోలవ్వగా ఒక ఓటు మెజార్టీతో ఎంప్లాయిస్ యూనియన్‌కు 150 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 5గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను విడుదల చేశారు. ఎన్నికల అధికారిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి విష్ణు వ్యవహరించారు. ఎన్నికల పక్రియను డీపో మేనేజర్ పర్యవేక్షించారు. ఫలితాల అనంతరం డిపో పరిధిలో విజయం సాధించిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

జాతీయ లోక్ అదాలత్
సద్వినియోగం చేసుకోవాలి
* జిల్లా జడ్జి లక్ష్మణరావు
మచిలీపట్నం (లీగల్), ఆగస్టు 9: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికై సెప్టెంబర్ 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద క్లైమ్స్, ఎక్సైజ్ తదితర కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.