కృష్ణ

సేవల్లో మహనీయులే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 15: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో అత్యుత్తమ సేవలే లక్ష్యంగా పని చేయాలని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీసు అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన పాలన అందించడం ద్వారా పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాఖాపరమైన ప్రణాళికలు, విధానాలను సమీక్షించుకుంటూ పురోగతి దిశగా అడుగులేయాలని సూచించారు. నగర పోలీసుశాఖ ఆధ్వర్యాన బందరురోడ్డులోని ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీసు కమిషనర్ తిరుమలరావు జాతీయ పతాకావిష్కరణ చేసి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా సాయుధ దళాలు నిర్వహించిన పరేడ్‌ను తిలకించారు. రిజర్వు దళాలు చేసిన కవాతు పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసుశాఖనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు, పోలీసు సిబ్బంది కుటుంబాలు, హోంగార్డులకు, ప్రముఖులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు భద్రతా భావాన్ని పెంపొందించేలా పని చేయాలన్నారు. పోలీసు విధుల్లో సవాళ్లు మామూలేనని, సమయస్ఫూర్తితో నేర్పుతో అధిగమిస్తూ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు, బాలల సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు పోలీసులకు తోడ్పాటు అందించాలని, అప్పుడే మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించేందుకు ఆస్కారముంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞనం వినియోగించడం ద్వారా సైబర్ నేరాలను నియంత్రించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని, నగరంలో తొలిసారిగా సైబర్ స్టేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా ఇటీవలే 12 ఇంటర్‌సెప్టార్ వాహనాలు సమకూర్చుకోవడం ద్వారా ప్రజలకు 24గంటలూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజల ఫిర్యాదులు, సమస్యలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇక కాల్‌మనీ పేరుతో ప్రజలను వేధించే వడ్డీ వ్యాపారులను ఉపేక్షించేదీ లేదని స్పష్టం చేశారు. నగరంలో భూ వివాదాలు, కబ్జాలకు ఆస్కారం ఇవ్వబోమని ఈ తరహా కేసుల్లో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఫ్లై ఓవర్ నిర్మాణాలు పూర్తయితే సమస్య తీరుతుందని, ప్రజలు కూడా ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ కనపరిచి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది ఆరోగ్యం, ఇతర అంశాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పాలనా విభాగం సిబ్బందికి మొత్తం 30మందికి మెరిట్ సర్ట్ఫికెట్లు అందచేశారు. అదేవిధంగా 16మంది అధికారులు, సిబ్బందికి ఉత్తమ సేవాపతకాలు, సేవాపతకాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ యోగానంద్, డీసీపీ బ్రహ్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రగతికి అద్దం పట్టిన ‘శకటాలు’
మచిలీపట్నం(కోనేరుసెంటర్), ఆగస్టు 15: జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ శాఖల చెందిన అధికారులు తమ శాఖల ప్రగతిని తెలియ చేసే విధంగా శకటాలను ప్రదర్శించారు. శకటాల ప్రదర్శనలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రథమ బహుమతి లభించింది. పేదింటి చెల్లికి పెద్దన్న సాయం క్యాప్షన్‌తో ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను కళ్లకు కట్టినట్టు శకటంలో ప్రదర్శించారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, పశు సంవర్ధక శాఖకు తృతీయ బహుమతి లభించగా సర్వశిక్షాభియాన్ శకటానికి కన్సొలేషన్ బహుమతి దక్కించుకుంది. తొలి మూడు స్థానాలు, కన్సోలేషన్ బహుమతిని దక్కించుకున్న ఆయా శాఖల అధికారులకు మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం బహుమతులు అందచేశారు.