కృష్ణ

అభివృద్ధే అందరి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 15: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని జిల్లాగా బాసిల్లుతున్న కృష్ణాజిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం ద్వారా పరిటాల సునీత, కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పెరేడ్‌ను పరిశీలించారు. ఇటీవల మృతి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు తోట రామలింగేశ్వరరావు భార్య వెంకట భారతమ్మను ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్‌పర్సన్ గద్దె అనూరాధ జాతీయ పతాకాన్ని ఎగుర వేసి వందనసమర్పణ చేశారు. తొలుత జాతిపిత మహాత్మ గాంధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సర్వశ్రేష్ఠ త్రిపాఠి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆకుల రఘుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు ‘ప్రశంస’
మచిలీపట్నం, ఆగస్టు 15: జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కార్యాలయాల సిబ్బంది బుధవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం చేతుల మీదుగా 350 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. జాయింట్ కలెక్టర్-2 పిడుగు బాబూరావు, జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, సోషల్ వెల్ఫేర్ జెడీ పిఎస్‌ఎ ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఇడీ సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ డీడీ యుగంధర్, డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మీరాప్రసాద్, వ్యవసాయ శాఖ జెడీ మోహనరావు, డీఎస్‌ఓ జి నాగేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఎ పీఓ కెడివిఎం ప్రసాదబాబు, డివిజనల్ ఫారెస్ట్ టెరిటోరియల్ అధికారి బెనర్జి, ఎపీ టిఐడీసీఓ పీడీ చిన్నోడుతో పాటు వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలు అందచేశారు.

ప్రగతికి అద్దం పట్టిన ‘శకటాలు’
మచిలీపట్నం(కోనేరుసెంటర్), ఆగస్టు 15: జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ శాఖల చెందిన అధికారులు తమ శాఖల ప్రగతిని తెలియ చేసే విధంగా శకటాలను ప్రదర్శించారు. శకటాల ప్రదర్శనలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రథమ బహుమతి లభించింది. పేదింటి చెల్లికి పెద్దన్న సాయం క్యాప్షన్‌తో ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను కళ్లకు కట్టినట్టు శకటంలో ప్రదర్శించారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, పశు సంవర్ధక శాఖకు తృతీయ బహుమతి లభించగా సర్వశిక్షాభియాన్ శకటానికి కన్సొలేషన్ బహుమతి దక్కించుకుంది. తొలి మూడు స్థానాలు, కన్సోలేషన్ బహుమతిని దక్కించుకున్న ఆయా శాఖల అధికారులకు మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం బహుమతులు అందచేశారు.