కృష్ణ

పేదల హృదయాలలో చిరస్మరణీయుడు రాజీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఆగస్టు 20: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం పాటుపడి దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ పేదల హృదయాలలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారని మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బొర్రా కిరణ్ అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 74వ జయంతి వేడుకలను సోమవారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్‌ను బొర్రా కిరణ్ కట్ చేసి అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి కిరణ్‌తోపాటు పిసిసి సభ్యులు కటారి ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కిరణ్, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చిన్నవయసులోనే ప్రధాని పదవి చేపట్టి టెలీకమ్యునికేషన్, సాఫ్ట్‌వేర్ రంగాలను అభివృద్ధి చేశారని, 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారని కొనియాడారు. బడుగుల అభ్యున్నతికై అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. అనంతరం స్థానిక పాత ప్రభుత్వాసుపత్రి ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ, చనమోలు వెంకట్రావ్, వైస్‌ఆర్ విగ్రహాలకు నేతలు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్య శాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మైలవరం మండల పార్టీ అధ్యక్షులు గాళ్ళ సాంబశివరావు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు కాండ్రకొండ అప్పారావు, యూత్ నాయకుడు రవికిరణ్, నేతలు ఎం శివాంజనేయులు, పిట్టల నాగేశ్వరరావు, కోడే శ్రీను, మసనం సుధాకర్, గిరి, కోడిరెక్కల ఫ్రసాద్, శీలం రామకృష్ణ, ఆనందరావు, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం (కోనేరుసెంటరు)
మచిలీపట్నం (కోనేరుసెంటరు): భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 74వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక రైతు బజారు వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి రామిశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. సాంకేతిక విజ్ఞానానికి నాంది పలికిన నేత అన్నారు. పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆరోగ్యం, సాంకేతికతను అగ్రదేశాలకు ధీటుగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలిపిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు. తొలుత రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కోకా ఫణి భూషణ్, అధికార ప్రతినిధి చలికొండ ధర్మారావు, జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్, వి శాంతిరాజు, మల్లేశ్వరరావు, దత్తుడు, ఎన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
కూచిపూడి భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి చేసిన రాజ్యాంగ సవరణ కారణంగానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వక్తలు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 74వ జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక శాంతి కాంప్లెక్స్‌లో పామర్రు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మొవ్వ మోహనరావు ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పులి శివరామకృష్ణ, హైదర్ అబ్బాస్ ఆలీ, బోలెం సాంబశివరావు, బండి మాధవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.