కృష్ణ

సాంకేతిక విప్లవానికి రాజీవ్‌గాంధీ నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 21: భారత దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొనియాడారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం 53వ డివిజన్ బుడమేరు వంతెన సెంటర్లోని రాజీవ్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ తన ఐదేళ్ల పాలన కాలంలో సమర్థవంతంగా ప్రజా పాలన సాగించి దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపించిన ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవినేని నెహ్రూ, కడియాల బుచ్చిబాబు, నరహరశెట్టి నరసింహరావు, కొలనుకొండ శివాజీ, గంగిశెట్టి బాబూరావు తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.

టిడిపిని మరింత బలోపేతం చేద్దాం

మచిలీపట్నం, మే 21: తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. స్థానిక సుల్తానగరం రామరాజు కనె్వన్షన్ హాలులో శనివారం పార్టీ మినీ మహానాడు జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ సర్వతోముఖ వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంకితభావంతో కృషి చేస్తున్నారన్నారు. వారి స్ఫూర్తితో కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. కొత్తవారిని కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు అందచేసినట్లు తెలిపారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తిరుపతిలో జరిగే మహానాడును జయప్రదం చేయాలని కోరారు. మహానాడులో చంద్రబాబు నాయుడు దశ, దిశ నిర్దేశం చేస్తారన్నారు. కష్టపడే కార్యకర్తలకే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల కోసం కొంత త్యాగం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదని ప్రశ్నించే స్థితికి కార్యకర్తలు రావాలన్నారు. నదుల అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. గోదావరి జలాలను నాగార్జున సాగర్‌కు తరలించడంతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఉచిత ఇసుకకు ఇష్టం వచ్చినట్లు కిరాయిలు వసూలు చేస్తే ఊపేక్షించమన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించవద్దని చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమానికి పాటుపడ్డ పార్టీ టిడిపి అన్నారు. ఆత్మగౌరవం పెరిట ఇందిరా గాంధిని తలదించుకునేటట్లు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. గత ఎన్నికల్లో 294 శాసనసభ నియోజకవర్గాలలో 225 సీట్లను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లను కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనలో ఆస్తులు తెలంగాణాకు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం సమర్ధుడైన చంద్రబాబుకే సాధ్యమన్నారు. అధికారం చేపట్టిన 45 రోజుల్లోనే విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి రావడం చంద్రబాబు దక్షతే కారణమన్నారు. త్వరలో ల్యాండ్ పూలింగ్ చేసి అద్భుతమైన పోర్టును నిర్మిస్తామన్నారు. బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ కూడు, నీడ, గుడ్డ అందించాలని, మహిళల ఆర్థిక స్వావలంబన కలిగించాలనే ఆశయంతో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం చేయనప్పటికీ నూతన రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గం ఏర్పాటుకు, పోర్టు నిర్మాణం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడును కోరతామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా టిడిపి అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ 80శాతం సీట్లు, ఓట్లు సాధించటమే లక్ష్యం కావాలన్నారు. అనంతరం నీటి సంరక్షణ ప్రతిజ్ఞను చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని నామకరణం చేయాలని, కొండపల్లి ఖిల్లాను గోల్గొండ ఖిల్లా తరహాలో అభివృద్ధి చేయాలని, కైకలూరు, పెడన, అవనిగడ్డ రైతాంగం కొరకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, జలీల్‌ఖాన్, గద్దె రామ్మోహన్, కాగిత వెంకట్రావు, తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ సునీత, పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల రామయ్య, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, బూరగడ్డ రమేష్ నాయుడు పాల్గొన్నారు.