కృష్ణ

లారీ బోల్తా -- పది మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 18: లారీ అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. మైలవరం మండలం చంద్రాల వద్ద మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం నూజివీడు నుంచి గణపవరం మీదుగా విజయవాడ వైపు లారీ వస్తోంది. నూజివీడులో భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా పనిచేస్తున్నారు. వీరు విజయవాడ వెళ్ళేందుకు మంగళవారం నూజివీడులో లారీ ఎక్కారు. చంద్రాల వద్ద ఎదురుగా వస్తున్న మూగజీవాలను తప్పించబోయి లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలకు గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీమా రాజ్‌కుమార్, సంపతి (18), సూరజ్ (23), గుంగా (16), సింగా (15), గాయత్రి (25), ప్రియాయాదవ్ (20), మిలాన్ యాదవ్ (21), పల్లెల రాజారెడ్డి (22), కన్నయ్య (19), తిరుపతయ్య (30) వీరంతా గాయపడినట్లు తెలిసింది. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మైలవరం సిఐ రామచంద్రరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సహాయపడ్డారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డెంగ్యూతో గృహిణి మృతి
అవనిగడ్డ, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని వేకనూరుకు చెందిన గుడివాక రజిని (33) గత నాలుగు రోజులుగా డెంగ్యూతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉండగా సోమవారం రాత్రి జ్వరం పెరిగి మృతి చెందింది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త శ్రీరామకృష్ణ మల్లవోలు ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నారు.