కృష్ణ

సామాన్యులకు సంతృప్తినిచ్చేలా పక్కాగృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: దేశంలో మొట్టమొదటి సారిగా పేదలకు పక్కాగృహాల పంపిణీ చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కుతుందని రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ, గృహ నిర్మాణ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలి సమావేశంలో జరిగిన లఘు చర్చలో తొలుత మంత్రి నారాయణ మాట్లాడుతూ టీడీపీ బ్రాండ్ ఇమేజ్‌గా నిలిచేవిధంగా హైక్వాలిటీ నిర్మాణాలు చేస్తున్నామన్నారు. కేవలం గృహ నిర్మాణాలే కాకుండా సామాజిక వౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఆధునికమైన షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. పేదలన్న చులకన భావం లేకుండా ఖరీదైన గృహాలలో వినియోగించే టైల్స్, కిచెన్ ఫర్నీచర్, డోర్స్, విండోస్‌ను హైక్వాలిటీతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 9 లక్షల గృహాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 5 లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. వ్యక్తిగత గృహాలతోపాటు జీప్లస్ త్రీ గృహాల నిర్మాణాలను కూడా చేపట్టి సొంత స్థలం లేని పేదలకు సైతం పక్కాగృహాలను అందజేయనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జీఎస్‌టీతోనే నిర్మాణ వ్యయం పెరిగిందని, టెండర్ల ప్రక్రియలో ఎటువంటి లోపాలు జరగలేదని బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో జరిగిన మాదిరిగా అవినీతి అక్రమాలకు తావివ్వకుండా కొన్ని కఠిన నిబంధనలను అమలుచేస్తున్నామన్నారు. కొన్ని వెసలుబాట్లను కూడా కల్పిస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా 4 లక్షల పక్కాగృహాల సామూహిక గృహప్రవేశాలు జరపడం దేశంలోనే కాక ప్రపంచ రికార్డని అభివర్ణించారు. గుజరాత్‌కు 11లక్షలు, యూపీకి 11.77లక్షలు, రాజస్థాన్‌కు 6.81లక్షలు, తమళనాడుకు 3.71లక్షల పక్కాగృహాలను మంజూరు చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 1.25 మాత్రమే గృహాలను మంజూరు చేసి వివక్ష చూపిందని విమర్శించారు. స్మార్ట్ పల్స్ సర్వే, ఆధార్‌కార్డు ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నట్టు వివరించారు.

హైక్వాలిటీ పేరుతో అప్పుల పాల్జేయడం విడ్డూరం
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 18: తక్కువ ఖర్చుతో బెస్ట్ క్వాలిటీ పక్కాగృహాలనిచ్చి పేదలకు మేలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో హౌసింగ్ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ హైక్వాలిటీ అంటూ లక్షలాది రూపాయల ఆర్ధిక భారాన్ని పేదలపై మోపడం సమంజసం కాదన్నారు. గృహాల కేటాయింపు జన్మభూమి కమిటీల ప్రమేయంతో పచ్చ చొక్కాలకే అధిక ప్రాధాన్యతనివ్వడం, టెండర్ ప్రక్రియలో తమకు అనుకూల సంస్థలకు లబ్దిచేకూర్చే విధానాలతో హౌసింగ్ ప్రాజెక్టు పక్కదారి పడుతోందన్నారు. వాస్తవానికి ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నా కేవలం రాష్ట్ర ప్రభుత్వ పథకంలాగా ప్రచారం చేసుకోవడం శోచనీయమని తెలిపారు. షేర్‌వాల్ టెక్నాలజీ కాకుండా ఇటుకల నిర్మాణంతో కొంత వ్యయం తగ్గి ఆర్ధికంగా వెసులుబాటు ఉండేదన్నారు.

సమాజాభివృద్ధిలో టీచర్లదే ముఖ్య భూమిక
గుడివాడ, సెప్టెంబర్ 18: సమాజాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎన్జీవో హోంలో ప్రైవేట్ టీచర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సన్మాన సభను నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి విద్యాబోధన చేస్తూ వేలాది మంది విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠల బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే కేఎస్ లక్ష్మణరావు, ఎన్జీవోల అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్షుడు షేక్ ఫరీద్‌భాషా, కార్యదర్శి జీ రాజేంద్రప్రసాద్, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ తదితరులు పాల్గొన్నారు.