కృష్ణ

పర్యాటక రంగం అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో 100 ప్రాంతాల్లో బౌద్ధారామాలను గుర్తించి బుద్ధిజాన్ని వ్యాప్తి చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రధానంగా అమరావతిని దేశంలోనే అతిపెద్ద దర్శనీయ బౌద్ధారామంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె మాట్లాడుతూ శ్రీలంక నుంచి విశాఖకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహాయాన బౌద్ధ సర్క్యూట్ పథకం కిందికి వచ్చే ప్రదేశాల్లో అమరావతి ఒకటిగా ఉందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ రూ. 21కోట్లు మంజూరు చేసిందన్నారు. కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. మోదుగుల మాట్లాడుతూ దేశాన్ని ప్రతి ఏటా 10లక్షల మంది బౌద్ధులు సందర్శిస్తున్నారని, వీరిలో ఎక్కువగా బీహార్ వెళుతున్నారన్నారు. వారిని మన రాష్ట్రానికి రప్పించటానికి ఎలాంటి ప్రయత్నం జరగటం లేదన్నారు. అమరావతితో పాటు నాగార్జున కొండను కూడా అభివృద్ధి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వదేశీ దర్శన రైలును రాష్ట్రానికి తీసుకురావటంలో విఫలమయ్యారన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ బౌద్ధం మతం కాదని, అదొక ధర్మమని అన్నారు. దేశంలో 86వేల బౌద్ధస్థూపాలు ఉంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా అనేకానేక స్థూపాలున్నాయని, వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియచేయాలని కోరారు. పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ ఏపీకి ఐకాన్‌గా ధ్యానబుద్ధ ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. అమరావతి అభివృద్ధికి హృదయ్, ప్రసాద పథకాల కింద రూ. 70కోట్లు మంజూరు కాగా, ఇప్పటికి రూ. 40కోట్లు మాత్రమే ఖర్చయినట్లు ఆయన వివరించారు.

రూర్బన్ ద్వారా వౌలిక సదుపాయాలు
చందర్లపాడు, సెప్టెంబర్ 18: రూర్బన్ మిషన్ పధకం ద్వారా గ్రామాలలో కావలసిన వౌలిక సదుపాయాలను కల్పించుకోవచ్చని నేషనల్ రూర్బన్ మిషన్ స్టేట్ కో ఆర్డినేటర్ వై ఇందిరాప్రియదర్శిని అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆమె మంగళవారం సమీక్షించారు. గతంలో చేపట్టిన పనులలో ఎన్‌ఆర్‌జిఎస్ ద్వారా సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు పనిచేసుకోనే అవకాశం ఉన్నందున దానికి కేటాయించిన నిధులను వేరే పనులకు వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే ప్రాజెక్ట్‌కు సంబంధించి మార్చి నాటికి నిధులను ఖర్చు చేయాల్సి ఉన్నందున వెంటనే పనులను ప్రారంభించాలని అన్నారు. దీనికి సంబంధించి అంగన్‌వాడీ, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బి అధికారులతో మాట్లాడి డిపిఆర్ సిద్దం చేయాలని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ శ్రీనాధ్‌నాయిని, జెడ్‌పిటిసి వాసిరెడ్డి ప్రసాద్, ఎంపిడిఒ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.