కృష్ణ

జగన్‌కు అండగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: అన్ని సామాజిక వర్గాలు రాష్ట్భ్య్రాన్నతి కోసం పరితపిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి వెంట నడవాలని ప్రభుత్వ మాజీ విప్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని హుస్సేన్‌పాలెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. ఇప్పటి వరకు టీడీపీకి కొమ్ము కాసిన వర్గాలు కూడా నేడు జగన్ పోరాట పటిమకు ఆకర్షితులవుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయి అధిపత్యం దక్కుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి జగన్మోహనరెడ్డి ‘నవరత్నాలు’ ఎన్నికల మానిఫెస్టోగా పెట్టారన్నారు. ప్రచారం అనంతరం రాత్రి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అందిపుచ్చుకుని రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బూత్‌ల వారీగా బూత్ కమిటీ ప్రతినిధులు, గ్రామ కమిటీ ప్రతినిధులు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలన్నారు.

గ్రామీణాభ్యుదయమే లక్ష్యం
* మేధావుల సదస్సులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 19: గ్రామీణాభ్యుదయమే తన లక్ష్యమని సీబీఐ మాజీ డైరెక్టర్ జెడీ లక్ష్మీ నారాయణ అన్నారు. స్థానిక వేడుక ఫంక్షన్ హాలులో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు, గ్రామీణుల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న డెప్యూటీ డైరెక్టర్ ఉద్యోగానికి తాను రెండు సార్లు ఇంటర్వ్యూకు వెళ్లినా తనకు ఆ అవకాశం రాలేదన్నారు. అందుకు ప్రధాన కారణంగా తాను పోలీసు శాఖలో పని చేస్తుండటమేనన్నారు. మనస్సుకు దగ్గరగా ఉన్న విషయాలపై పని చేయాలనే సంకల్పంతో మహారాష్ట్ర డీజీపీ పదవికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి వచ్చినట్టు తెలిపారు. పదవికి రాజీనామా చేసిన నాటి నుండి నేటి వరకు గ్రామాల్లో పర్యటిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధంగా అన్ని నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్యాయాలు, అక్రమాల గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదన్నారు. రానున్న ఏడు సంవత్సరాల్లో 75 శాతం జనాభా యువతేనన్నారు. యువతకు మార్గదర్శనం చేసే బాధ్యత ప్రతి ఒక్క మేధావి తీసుకోవాలన్నారు. ఎన్నికలు అవినీతిమయం అంటున్న మనం దాన్ని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. డబ్బు, కులం లేని రాజకీయాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. సామాజిక వర్గం ముఖ్యం కాదు - సమాజం ముఖ్యం అన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. ప్రతి ఒక్కరూ వృత్తి ధర్మం, సామాజిక ధర్మాన్ని పాటించాలన్నారు. ప్రముఖ న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణానికి రైతులతో చర్చ
పామర్రు, సెప్టెంబర్ 19: మండలంలోని కురుమద్దాలిలో గృహ నిర్మాణ పథకం కింద 96 మంది లబ్ధిదారులకు జీప్లస్‌టు కింద నిర్మించే గృహాలకు భూసేకరణకై రైతులతో చర్చించామని గుడివాడ ఆర్డీఓ గుత్తుల వెంకట సత్యవాణి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కురుమద్దాలిలో లబ్ధిదారులకు జీప్లస్‌టు కింద నిర్మించే గృహాలకు సంబంధించిన భూసేకరణ నిమిత్తం తహశీల్దారు ఎం పద్మతో కలిసి రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సత్యవాణి మాట్లాడుతూ కురుమద్దాలిలో నిర్మించనున్న జీప్లస్‌టు గృహాలకు సంబంధించి ఇప్పటి వరకు 45 సెంట్లు భూమిని గృహ నిర్మాణ శాఖాధికారులకు అప్పగించామని, ఇంకా సుమారు మరో 70 సెంట్లు భూమి అవసరం ఉందన్నారు. అలాగే మండల పరిధిలోని అన్ని గ్రామాలలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు అవసరమైన భూమిని సేకరించి అందించాలని తహశీల్దార్, వీఆర్‌ఓలకు సూచించారు. మండలంలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎం పద్మ, మాజీ సర్పంచ్ కె స్వప్న తదితరులు పాల్గొన్నారు.