కృష్ణ

తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మూడోసారి మైల‘వరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 19: ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఆయనే. ఒకప్పుడు జమిందారీ వ్యవస్థ, సంస్థానాలు కొనసాగుతున్నప్పుడు ఆయన పూర్వికులే మైలవరం, నూజివీడు, చింతలపూడి ప్రాంతాలను ఏలారు. ఎన్నో దాన ధర్మాలు చేశారు. దేవాలయాలను నిర్మించారు. ఆధ్యాత్మికం, కళా, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించారు. జమిందారీ వ్యవస్థ, సంస్థానాలు రద్దయినా వారి వారసులుగా దాన ధర్మాలు చేస్తూ సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తూ పూర్వికుల పేరు ప్రఖ్యాతులను కొనసాగిస్తున్న మనసున్న మనిషి ఎస్పీఎస్. మైలవరంలోనే కాక ఈ ప్రాంతంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా దివాణంలోని దొరవారే పరిష్కారం. అది రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సమస్య కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా దర్బార్‌లో ఆయనొక జీతం లేని జడ్జి. ఆయనే ద్వారకా తిరుమల దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త (అనువంశిక ధర్మకర్త) సూరానేని వేంకట సుధాకరరావు బహుద్దూర్ జమిందార్ (ఎస్వీఎస్). ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్‌గా అక్కడి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అతి తక్కువ కాలంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయటం, దానికి అనుంబంధంగా అనేక దేవాలయాల అభివృద్ధికి సహకరించటం, దేవాలయాల ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించటం, కళారంగాన్ని ప్రోత్సహించటం, సాంస్కృతిక, సామాజిక, సేవా రంగాలలో విశేషమైన సేవలందించినందుకు గానూ అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎస్వీ సుధాకరరావుకు, మైలవరం సంస్థానానికి ప్రత్యేక స్థానం దక్కింది. ఈ సంఘటనతో మైలవరం పేరు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మూడోసారి నమోదు చేసుకున్నట్లైంది. ఇంతకు ముందు మైలవరంలోని శ్రీ షిరిడీ సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో జరిగిన రెండు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విషయం విధితమే. ఎస్వీఎస్‌కు ఈ అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని మైలవరం నుండే కాక పలు ప్రాంతాల నుండి ప్రముఖులు బుధవారం ఇక్కడికి తరలివచ్చి ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఆధ్యాత్మిక, సామాజిక సేవలకే ఈ గుర్తింపు: ఎస్వీఎస్
కలియుగ దైవం ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సేవతోపాటు ఆ దేవదేవుని కృపతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సేవా రంగాలలో చేసిన సేవలకు గానూ తనకు, తన సంస్థానానికి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అరుదైన గుర్తింపు లభించిదని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన మైలవరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ద్వారకా తిరుమల దేవస్థానం రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాలలో తిరుమల తిరుపతి తర్వాత స్థానం దక్కించుకుందన్నారు. వంశపారంపర్య ధర్మకర్తల దేవాలయాలు రాష్ట్రంలో ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలేనని, వీటికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాలక మండలి ఉందని, అటానమస్ పాలకమండలి ఆధ్వర్యంలో ఇవి కొనసాగుతాయన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఓరియంటల్ హైస్కూల్, వైఖానస ఆగమ పాఠశాల కొనసాగుతున్నాయన్నారు. ఈ విద్యాలయాలలో చదివే పిల్లలందరికీ ఉచితంగా మద్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దేవస్థానం పరిధిలో సుమారు 60 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రహదారులు, భవనాలను నిర్మించి దేవాదాయ, రెవెన్యూ శాఖల మంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించినట్టు ఎస్వీఎస్ వెల్లడించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద గోశాలను నడుపుతున్నట్లు తెలిపారు. 18 కోట్ల రూపాయలతో వకుళమాత అన్నదాన భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తిరుమల తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి తరహాలో ద్వారకా తిరుమలలో రూ. 100 కోట్లతో విర్డ్ ఆసుపత్రిని నడుపుతున్నట్లు వివరించారు. ఇక్కడ ఇప్పటి వరకూ 65వేల మందికి ఆర్థో పరీక్షలు నిర్వహించి 2,761 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. 1700 మంది పేద పిల్లలకు శస్త్ర చికిత్సలు జరిపి వారికి అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందించామన్నారు. వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ ఆనందరాజు 20 కోట్ల రూపాయల విరాళాన్ని ఈ ఆసుపత్రికి అందించినట్లు తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగరాజు రెండు కోట్లు, టిటిడి పది కోట్లు, ద్వారకా తిరుమల దేవస్థానం ఐదు కోట్ల రూపాయల విరాళాలు అందించినట్లు పేర్కొన్నారు. రాత్రి సమయాలలో కొండపైకి నడిచి వచ్చే భక్తులకు దారి పొడవునా ప్రత్యేక విద్యుద్దీకరణ, వారికి అంబులెన్స్ సదుపాయం, ఉచిత మందులు పంపిణీని ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నడిచి వచ్చే భక్తులకు ఉచిత వసతి, దర్శనం, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇకపై రెండు పూటలా ఉచిత అన్నప్రసాదం
ద్వారకా తిరుమలలో ఇప్పటి వరకూ మధ్యాహ్న సమయంలోనే భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందించామని బుధవారం నుండి రెండు పూటలా అన్నప్రసాదాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలలో రెండు పూటలా నిత్యాన్నదానం కార్యక్రమం తిరుమల తిరుపతి తర్వాత ద్వారకా తిరుమల దేవస్థానంలోనేని ఆయన వెల్లడించారు. ఇక్కడి గోశాల ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా పాలు అందిస్తున్నామన్నారు.

పోలవరం కుడి కాల్వ ద్వారా నీటి సౌకర్యం
దేవస్థానానికి వచ్చే భక్తులకు ఉన్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహకారంతో పోలవరం కుడి కాలువ ద్వారా నీటి సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి ఉమకు, ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఒకవైపు ఆదాయ వనరులను సమకూర్చుకుంటూ మరో వైపు అభివృద్ధి చేసుకుంటూ స్వామి సేవలోనే పునీతమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా దేవస్థానం అభివృద్ధి, భక్తులకు విశేష సేవలందించటం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యమాలను నిర్వహిస్తున్నందుకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తనకు స్థానం లభించిందని దాని ప్రతినిధులు తనకు గుర్తింపు పత్రాన్ని అందించినట్లు తెలిపారు. ఈ యజ్ఞంలో భాగస్వాములైన అందరికీ ఎస్వీఎస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ద్వారకా తిరుమల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, లయన్ మల్టిపుల్ చైర్‌పర్సన్ ఎస్వీఎన్ నివృత్‌రావు, నిరాహుల్‌రావు తదితరులు పాల్గొన్నారు.