కృష్ణ

చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 6: చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోందని పరిశ్రమల స్థాపనకు 14 రోజుల్లో ఆన్‌లైన్‌లో అనుమతులిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎ కనె్వన్షన్ సెంటర్‌లో పరిశ్రమలు, సేవా రంగం రెగ్యులేటరీ, సెక్టార్‌లో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధికి మూలాలు గ్రామాలేనని, గ్రామాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాను ప్రకటించిన దానికంటే ఎక్కువ చేస్తున్నానని, టూరిజం హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మారుస్తానన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలు పెరగాలని, విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్ వ్యవస్థ మెరుగుపరుస్తామని, మీ ఇంటికి మీ భూమి విజయవంతమైందని, మీ భూమి మీ పేరు మీద వుందా అని తెలుసుకోటానికి దోహదపడుతుందన్నారు. పర్యాటక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం జరుగుతుందని, ప్రపంచంలో ఉన్న దేశాల నుండి పర్యాటకులు మన రాష్ట్రానికి వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. విజయవాడ సుందరమైన నగరమని, పుణ్యనది కృష్ణానది ఉండటం మన అదృష్టమన్నారు. తెలుగువారు గౌరవం పెరిగేలా రాజధాని నిర్మాణం చేపడతామని, ప్రతి ఒక్కరూ అభివృద్ధికి దోహదపడాలన్నారు. పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా మన పిల్లల భవిష్యత్ బాగుపడుతుందన్నారు. ఆగస్టు 15 నాటికి కోటీ 50 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని, సంపద పెరగటానికి వ్యవసాయం అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం దోహదపడతాయన్నారు. రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం అనేక ఇబ్బందులకు గురైందని ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందన్నారు. గతంలో పరిశ్రమలు స్థాపించాలంటే అనుమతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. స్థానిక వనరులను, అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని, నూతన రాజధానిలో పరిశ్రమలు స్థాపించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. టూరిజం శాఖ కమిషనర్ రాజేంద్రప్రసాద్ పజోరియా మాట్లాడుతూ టూరిజం పరంగా రాష్ట్రంగా పలు ప్రదేశాలకు టూరిస్టు స్పాట్‌లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విశాఖపట్నం, కోనసీమ, రాజమండ్రి, కాకినాడ, అమరావతి, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల్లో టూరిజం ప్రాంతాలను గుర్తించి పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్యాటక కేంద్రానికి ఎయిర్‌పోర్ట్, రైల్వే కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి జిల్లా ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదగాలని, ఫుడ్ ప్రాసెసింగ్‌లో యూనిట్లు స్థాపించేందుకు ట్యాక్స్‌లను రద్దుచేయాలని, ట్రేడ్ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు. ఎఫ్‌ట్రానిక్స్ చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుని జిడిపి పెంచుకోవాలని, నూతన టెక్నాలజీ, పరిజ్ఞానం రాష్ట్రంలో అమలుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, జెడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బాబు.ఎ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.