కృష్ణ

ఏఎంజీకే ఎత్తిపోతల పథకం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, సెప్టెంబర్ 22: ఆత్కూరు-ముత్యాలంపాడు - జి.కొం డూరు (ఎఎంజికె) ఎత్తిపోతల పథకం విజయవంతం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్.ముత్యాలంపాడు పరిధిలో బుడమేరు పక్కన నుంచి గోదావరి నీటిని పంపింగ్ హౌస్‌లో మోటార్ల సాయంతో ఎత్తిపోసి, పైపులైన్ల ద్వారా మళ్ళించడానికి రూ.2.14కోట్ల నిధులు ఐడిసి నుంచి మంజూరయ్యాయి. నాలుగు నెలల క్రితం పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.
గోదావరి నీటిని మూడు గ్రామాల్లోని ఐదు చెరువులకు మళ్ళిస్తున్నారు. దీనివల్ల జి.కొండూరులోని ఒక చెరువుకు, హెచ్.ముత్యాలంపాడులోని రెండు, ఆత్కూరులోని రెండు చెరువుల కింద ఉన్న 2వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కలుతున్నదని తెలుగు యువత జిల్లా కార్యదర్శి ఈమని మురళీకృష్ణ, మైలవరం ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ పటాపంచల నరసింహారావు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఈ పథకం ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఆయా చెరువులన్నీ వర్షాలు కురిస్తేనే నీటితో నిండేవి. రైతాంగ సమస్యలపై అధిక శ్రద్ధ చూపుతున్న నాయకులకు కూడా రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే పథకానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చి విజయవంతంగా అన్ని రోజులు రన్ చేయాలని రైతులు కోరుతున్నారు.

లంక ప్రజల శ్రేయస్సుకే బ్రిడ్జి
* రెండేళ్లలో పూర్తి చేస్తాం
* ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు
తోట్లవల్లూరు, సెప్టెంబర్ 22: లంక ప్రజల శ్రేయస్సు కోసమే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తోందని ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తోట్లవల్లూరు - పాముల్లంక పాయలోని బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని వెంకటేశ్వరరావు అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. పాయకు ఎంత వరద వస్తుందో అడిగి తెలుసుకున్నారు. కరకట్ట సమీప పొలాల్లోని రైతులతో ముందుగానే ఒప్పంద పత్రాలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. నది మధ్యలో సొసైటీ భూములు ప్రభుత్వానివని, అక్కడ ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ 342 మీటర్ల హైలెవల్ బ్రిడ్జికి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.30 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వల్లభనేని కనస్ట్రక్షన్స్ టెండర్ వచ్చిందన్నారు. వర్షాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయన్నారు. వంతెనకు శంకుస్థాపన చేసిన తరువాత వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ల కాలపరిమితి ఉందని, అయితే సంవత్సరం లోపే నిర్మించేందుకు కాంట్రాక్టర్లు కృషి చేస్తామని చెపుతున్నారని వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన వెంట ప్రాజెక్టు ఎస్‌ఈ కె శివకుమార్, ఈఈ శ్రీనివాసులు, డీఈ రామాంజనేయప్రసాద్. ఏఈ ఎం వెంకన్న, మాజీ సర్పంచ్ పాముల శ్రీనివాసరావు, కాంట్రాక్టరు వల్లభనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.