కృష్ణ

విషాదాన్ని మిగిల్చిన విహార యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, సెప్టెంబర్ 23: విహార యాత్ర ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. నగరంలోని పంజా సెంటరుకు చెందిన మహమ్మద్ జైజుల్లా (19)తో పాటు సుమారు 30 మంది స్నేహితులు ఆదివారం విహార యాత్రకై కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్‌కు వచ్చారు. వీరంతా నగరంలోని ఎస్‌ఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. స్నేహితులంతా ఎంతో సరదాగా బీచ్‌లో స్నానాలు చేస్తుండగా జైజుల్లా అలల ఉధృతికి గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు జైజుల్లాను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. స్నేహితుడి ఆచూకీ కనిపించకపోవటంతో బోరున విలిపిస్తూ గల్లంతైన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్‌ఐ ప్రియ కుమార్ హుటాహుటిన బీచ్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రం వరకు గల్లంతైన జైజుల్లా ఆచూకీ కోసం బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ పరిసరాల్లో హంసలదీవి మాజీ సర్పంచ్ కొక్కిలిగడ్డ సముద్రాలు, గజ ఈతగాళ్లు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నగరం నుంచి మృతుడి కుటుంబ సభ్యులు సాయంత్రానికి కోడూరు చేరుకున్నారు. విద్యార్థి గల్లంతుపై కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

బీచ్‌లో యువకుడు గల్లంతు
కోడూరు, సెప్టెంబర్ 23: విహార యాత్ర ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ పంజా సెంటరుకు చెందిన మహమ్మద్ జైజుల్లా (19)తో పాటు సుమారు 30 మంది స్నేహితులు ఆదివారం విహార యాత్రకై కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్‌కు వచ్చారు. వీరంతా విజయవాడలోని ఎస్‌ఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. స్నేహితులంతా ఎంతో సరదాగా బీచ్‌లో స్నానాలు చేస్తుండగా జైజుల్లా అలల ఉధృతికి గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు జైజుల్లాను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ప్రియకుమార్ హుటాహుటిన బీచ్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సాయంత్రం వరకు గల్లంతైనా జైజుల్లా ఆచూకీ కోసం బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ పరిసరాల్లో హంసలదీవి మాజీ సర్పంచ్ కొక్కిలిగడ్డ సముద్రాలు, గజ ఈతగాళ్లు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈమేరకు కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.