కృష్ణ

అన్నదానం రచ్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, సెప్టెంబర్ 23: గుడివాడలోని మార్కెట్ సెంటర్ బంటుమిల్లి రోడ్డుపై ఆదివారం జరిగే అన్నదానాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా నిర్వహించే అన్నదానం రోడ్డుపై కుదరదని డీఎస్పీ మహేష్ తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉదయం నుండి మార్కెట్ సెంటర్లోని వినాయకచవితి పందిరి దగ్గర, బంటుమిల్లి రోడ్డులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రోడ్డుపై టెంట్‌లు, టేబుల్స్, కుర్చీలు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు పక్కన మార్జిన్‌లు, అంతర్గత రోడ్లలో అన్నదానం జరుపుకోవాలని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యే కొడాలి నాని ససేమిరా అన్నారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్‌తో కలిసి బంటుమిల్లి రోడ్డుకు చేరుకున్నారు. డీఎస్పీ మహేష్‌తో ఎంతగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. టేబుల్స్, కుర్చీలు వేసి భోజనాలు పెట్టేందుకు అనుమతించేది లేదని చెప్పడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసుల ఎదుటే క్షణాల్లో రోడ్డుపై రెండు వైపులా టేబుల్స్, కుర్చీలు వేసి భోజనాలు వడ్డించడం ప్రారంభించారు. దీన్ని గమనించే లోపు రోడ్డుకు ఒకవైపు భోజనాల వడ్డన జరిగిపోయింది. రెండవ వైపు కూర్చున్న వారిని బలవంతంగా లేపి, టేబుల్స్‌ను, కుర్చీలను పోలీసులు తొలగించారు. దీంతో కొద్దిసేపు రోడ్డుకు ఒకవైపు మాత్రమే భోజనాలు పరిమితమయ్యాయి. ఈ దశలో మళ్ళీ ఎమ్మెల్యే కొడాలి నాని జోక్యం చేసుకుని దగ్గరుండి మళ్ళీ టేబుల్స్ వేయించి భోజనాలను పెట్టడం మొదలుపెట్టారు. చాలా మంది నిలబడి భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10వేల మంది ప్రజలు సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలు తీయడం ఆటవికం
మచిలీపట్నం, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేయడాన్ని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధులను హత్య చేయటం మావోయిస్టులు దుర్మార్గపు చర్య అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామదర్శినికి వెళుతున్న వారిపై మావోయిస్టులు కాపు కాచి కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్య అన్నారు. మావోయిస్టులకు ప్రభుత్వంతో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులను కాల్చి చంపడం సరైన విధానం కాదన్నారు. సర్వేశ్వరరావు, సోమల మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాలతో పాటు ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి సోమేశ్వరరావు ఎనలేని సేవలు అందించారన్నారు. సర్వేశ్వరరావు, సోమల కుటుంబ సభ్యులకు మంత్రి రవీంద్ర ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

దోమల దండయాత్ర!
కూచిపూడి, సెప్టెంబర్ 23: దోమల దండయాత్ర... అవును మీరు చదువుతున్నది కరెక్టే... అదేంటి ‘దోమలపై దండయాత్ర’ కదా అనుకుంటున్నారా? నిజమే అది ప్రభుత్వం చేపట్టిన ‘కార్యక్రమం’. వాస్తవానికి రెండు వర్గాల మధ్య ‘జరిగితేనే యుద్ధం’. మొవ్వ మండలంలో అదే జరుగుతోంది. మొవ్వ మండలంలోని ఏ గ్రామంలో చూసినా మురుగు గుంటలు... అక్కడ తమ సైనాన్ని సమాయత్వం చేసుకుని యుద్ధానికి ‘దోమలు సన్నద్ధం అవుతున్నాయ. ఫలితంగా మండలంలో ఏ గ్రామంలో చూసినా ‘దోమ కాటు బాధితులు’, ‘జ్వర పీడితులే’ కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సైతం బహిరంగ సభలో పేర్కొనడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏదైనా పథకం ఫలవంతమవ్వాలంటే తగినంత మంది మందీమార్బలం అవసరం. ‘కర్ణుని చావుకి సవాలక్ష’ కారణాలున్నట్టే దోమలపై యుద్ధానికీ అనే్న సమస్యలున్నాయ. మొవ్వ, నిడుమోలులోని పీహెచ్‌సీలు ఉన్నా వైద్యులు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయ. దీనికితోడు పంచాయతీ సర్పంచ్‌లు పదవీ కాలం ముగియడంతో పంచాయతీల పగ్గాలు ‘ఇన్‌ఛార్జి’ల పరమయ్యాయ. ఇంకేముంది లక్ష్యం లేని పనితనంతో ఎవరికి వారు బాధ్యతారాహిత్యంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయ కుప్పలతెప్పలుగా దర్శనమిస్తున్నాయ. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు ఆవాసాలవుతున్నాయ. ఎవరిని పలకరించినా ఏదో జ్వరమో, మరేదో రోగమో బారినపడినట్టు మొరపెట్టుకుంటున్నారు. దాదాపు నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఎవరికి వారు ‘పరామర్శ’ చేసి ‘మన పని అయపోయనట్టు’ వెళ్లిపోతున్నారు. సమస్య సమస్యగానే ఉంటోంది... కాదు మరింత పెరిగి పెద్దదవుతోంది. ఏ రోగమొచ్చినా ప్రైవేటు
ఆస్ప్రతికి పోవద్దు... సర్కారు దవాఖానాకే పోండని ఉన్నతాధికారులు సెలవిస్తున్నా అక్కడి పరిస్థితిని చూసి ప్రజలు అంత ధైర్యం చేయలేకపోతున్నారు. ఎవరికి మాత్రం ‘ప్రాణ భయం’ ఉండదు చెప్పండి. నిత్యం పదుల సంఖ్యలో పిహెచ్‌సీలకు రోగులు వస్తున్నా అధికారుల ‘ప్రకటనలు’ మినహా చేపట్టిన చర్యలు మృగ్యమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.