కృష్ణ

గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాజిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ ఎస్‌వీబీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనఖీలు చేశారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో కార్యాలయంలో ఉన్న 10 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 7,52,560ను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది దగ్గర ఉన్న నగదును కూడా తీసుకున్నారు. లెక్కల్లో లేని నగదును సీజ్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుండి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించినట్లు ప్రసాదరావు తెలిపారు. ఐదుగురు సీఐలు సభ్యుల బృందం ఈ దాడుల్లో పాల్గొన్నాయి. గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరగడంతో మధ్యదళారులు ఎక్కువయ్యారన్నారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోనికి ప్రవేశించడంతో జేబుల్లో, డెస్కుల్లో ఉన్న సొమ్మును కిటీకిల్లో నుండి బయటకి విసిరివేసినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ అనంతరం ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి చెల్లించే నగదు కంటే పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రసాదరావు స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సీఐలు వెంకటేశ్వరరావు, రమేష్‌బాబు, కెనడీ, వెంకటేశ్వర్లు, కృష్ణ, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.