కృష్ణ

సీనియర్ గైనకాలజిస్ట్ డా. చాముండేశ్వరి హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 24: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ గైనకాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డా. యార్లగడ్డ చాముండేశ్వరి దేవి సోమవారం హఠాన్మరణం చెందారు. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమె గత మూడు రోజులుగా విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం ఉదయం 10గంటల సమయంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతి పట్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. ఆమె మృతి పట్ల రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని)లు సంతాపం తెలియచేశారు. డా. చాముండేశ్వరి దేవి భౌతికకాయాన్ని సాయంత్రం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు, తూర్పు కృష్ణా ఎన్‌జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు వుల్లి కృష్ణతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతదేహాన్ని చిలకలపూడిలోని ఆమె స్వగృహానికి తీసుకువెళ్లారు. మంగళవారం ఉదయం 9.30ని.లకు చాముండేశ్వరి దేవి అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.