కృష్ణ

పెన్షన్ స్కాం కేసులో రికార్డ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 24: దొంగ ఉపాధ్యాయ పోస్టులను సృష్టించి ప్రభుత్వం నుండి అక్రమంగా లక్షలాది రూపాయలు పెన్షన్ పొందిన స్కాం కేసులో సోమవారం పోలీసులు ఉపాధ్యాయుల సర్వీసు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉయ్యూరుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రంగరామానుజాచార్యులు తన పలుకుబడి తెలివితేటలతో దొంగ ఉపాధ్యాయులను సృష్టించారు. అసలు ఉపాధ్యాయులుగా పనిచేయకుండానే కొనే్నళ్లపాటు నెలనెలా పెన్షన్ పొందిన దొంగల గుట్టు రెండేళ్ల క్రితం వెలుగు చూసింది. ఉయ్యూరు పోలీస్‌స్టేషన్‌లో దీనిపై కేసు నమోదయింది. అప్పట్లో జిల్లాలో ఈ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. తోట్లవల్లూరు మండలంలోని ఓ పాఠశాలలో రంగమానుజాచార్యులు ఉపాధ్యాయుడుగా పని చేశారు. తన బంధువులు పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేసి రిటైర్డ్ అయినట్టు రికార్డుల్లో నమోదు చేయించి పెన్షన్ పొందేలా చేశారనేది అభియోగం. ప్రస్తుతం ఈ కేసులో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురి పాత్ర ఉన్నట్టుగా చెపుతున్నారు. దీంతో సోమవారం ఎస్‌ఐ మురళీ మండల విద్యాశాఖ కార్యాలయానికి ఎంఈఓ జి వెంకటేశ్వరరావుతో కేసు వివరాలను చర్చించారు. కేసులో దర్యాప్తు నిమిత్తం 2002 నుంచి 2009 వరకు మండలంలోని పని చేసిన ఉపాధ్యాయులు వివరాలు, సర్వీసు రిజిస్టర్‌ల వివరాలను ఎస్‌ఐ కోరారు. సీఐ కార్యాలయానికి తీసుకెళ్లే నిమిత్తం సర్వీసు రికార్డులను ఎంఈఓ ఎస్‌ఐకు అప్పగించారు.
విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి
* ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 24: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి పవన్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అయినప్పటికీ నేటికీ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ పూర్తి కాలేదన్నారు. జ్ఞానభేరి పేరుతో ప్రభుత్వం ఎన్నికల ప్రచారానికి తెర లేపుతుందే గానీ సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం చొరవ చూపడం లేదని ఆరోపించారు. కోట్లాది రూపాయలు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయి పడ్డ ప్రభుత్వం వాటిని ఎప్పుడు చెల్లిస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.