క్రైమ్/లీగల్

ఇద్దరు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కొండూరు : మండలంలోని పోలిశెట్టిపాడు దళితవాడకు చెందిన వాసం వాసు(13), వాసం దిలీప్(18) ఆదివారం సాయంత్రం ఎర్రచెరువులో ఈతకు వెళ్లి నీటమునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన వాసం శ్రీను - నాగమణి కుమారుడు వాసు, వాసం ఆనందరావు - కనకరత్నం కుమారుడు దిలీప్ ఆదివారం పాఠశాల, కళాశాలకు సెలవు కావడంతో సాయంకాలం సరదాగా ఈత కొట్టేందుకు ఎర్రచెరువులో దిగాయి. అయితే లోతైన గోతిలో పడి వారు మృతి చెందారు. చీకటి పడినా తమ కుమారులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెదికారు. ఆచూకీ తెలియకపోవడంతో ఎర్రచెరువు వద్దకు వెళ్ళి చూడగా సైకిలు, చెప్పులు కనిపించడంతో ఈతగాళ్ళతో చెరువులో వెతికించారు. ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దిలీప్ తిరువూరులోని ఒక ప్రవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వాసు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థి. మృతదేహాలకు సోమవారం శవపంచనామా నిర్వహించిన అనంతరం తిరువూరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జె వెంకటరమణ వివరించారు.
ఎమ్మెల్యే పరామర్శ
దిలీప్, వాసు కుటుంబాలను సోమవారం తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పరామర్శించి ప్రగాఢ (మిగతా 6 లో)
సానుభూతి తెలిపారు. కుటుంబాలకు ఆసరాగా నిలవాల్సిన పిల్లలు చెరువులో పడి మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ ప్రమాదానికి నీరు-చెట్టు పథకం ద్వారా అక్రమ తవ్వకాలు జరపడమే కారణమని ఆయనన్నారు. తహశీల్దార్ ఎం సురేష్‌కుమార్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయంగా రూ.10వేలు అందజేశారు. కర్మకాండలకు అయ్యే ఖర్చులను ఎస్‌ఐ వెంకటరమణ తనవంతు సాయంగా అందజేశారు. ఎంపీపీ వాసం మునియ్య, నరెడ్లా వీరారెడ్డి, టి వెంకటేశ్వరరెడ్డి, ఏ వెంకటరెడ్డి, నాగనర్సిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బలుమూరి నాగపద్మ, వాసం యశోద, వాసం నాగేశ్వరరావు రెండు కుటుంబాలను పరామర్శించారు.