కృష్ణ

ప్రజలకు ‘చేరువ’గా నేర నియంత్రణ రథాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 16: ప్రజలకు సన్నిహితులుగా వారితో మమేకమై వినూత్న సేవలందించేందుకు పోలీసు శాఖ ప్రవేశపెట్టిన చేరువ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో చేరువ ద్వారా ఇప్పటికే పోలీసులు ప్రజలతో మరింత చేరువై ఉత్తమ సేవలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించేందుకుగాను ఏర్పాటు చేసిన చేరువ నేర నియంత్రణ రధాలు కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకెళ్తున్నాయి. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసేకన్నా.. జరుగుకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో అందుకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపొందించడమే రధాల ప్రధాన ఉద్ధేశ్యంకాగా నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో సూర్యారావుపేట పోలీస్టేషన్ పరిధిలోని రెడ్‌సర్కిల్, దుర్గాపురం, అమెరికన్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో మంగళవారం సంచరించిన ఈ వాహనం వాటికి అమర్చిన ఎల్‌సిడి టివి ద్వారా విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిఐ ఎం సత్యనారాయణ ప్రజలకు వివరిస్తూ రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మహిళా సంబంధ నేరాలు, ఈవ్‌టీజింగ్, ఫోర్త్‌లయన్ మొబైల్ యాప్, మహిళా మిత్ర, బాలమిత్ర, వృద్ధమిత్ర, డోర్‌లాక్ మానటరింగ్ సిస్టం, పోలీసు వాట్సాప్ నెంబర్, ఇంటర్‌సెప్టర్ వాహనాలు తదితర అంశాల గూర్చి తెలియచేశారు.

శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 16: న్యూ సనత్‌నగర్‌లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం మిచ్చింది. ఉదయం ప్రత్యేక ఉభయదాతల పూజల్లో వి రాధాకృష్ణ దంపతులతో మరో 30మంది దంపతులు పాల్గొని ప్రత్యేక కుంకుమార్చనలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు కొట్టే రాజ్‌మోహన్, దారం వీరప్రసాదరావు, గాదె శ్రీకాంత్, పడాల రాంబాబు, తదితరుల పర్యవేక్షణలో సాయంత్రం అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదురకాలైన ప్రసాదాలను అమ్మవార్లకు నివేదించి తర్వాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. నగరానికి చెందిన పలువురు విఐపిలు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు అమ్మవారి సన్నిధిలో వివిధ ఆధ్యాత్మిక, సంకీర్తన, కార్యక్రమాలను నిర్వహించారు.

ఆపదలో ఉన్న బాలల రక్షణలో రైల్వే ఉద్యోగులందరిదీ కీలక పాత్ర
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 16: ఆపదలోఉన్న బాలలు తప్పిపోయిన, పారిపోయిన అక్రమ రవాణాకు సరైన వదిలివేయబడిన అనాధలు వీధి బాలలందరి రక్షణలో రైల్వేశాఖ ఉద్యోగులందరిదీ కీలకపాత్ర అని కృష్ణాజిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ బివిఎస్ కుమార్ అన్నారు. మంగళవారం రైల్వే హాస్పిటల్‌లోని నర్సులు, హెల్త్ వర్కర్స్‌కు రైల్వే చైల్డ్‌లైన్-1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ- మనందరి భాద్యత అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈసదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న కుమార్ మాట్లాడుతూ రైల్వే ఎస్‌ఓపి ప్రకారం రైల్వే పరిసర ప్రాంతాల్లో, రైళ్ళ ద్వారా ప్రయాణిస్తూ ఆపదలో ఉన్న బాలలందరినీ రైల్వే ఉద్యోగులందరూ కలిసి రక్షించాలని, వారిని చైల్డ్‌లైన్-1098కు తెలియపరచి అప్పగించాలని, విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉన్న హెల్ప్‌లైన్‌లో అప్పగించాలన్నారు. భారతదేశం వ్యాప్తంగా ముఖ్యమైన రైల్వేస్టేషన్‌ల్లో చైల్డ్‌లైన్-1098 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ బాలల సంరక్షణాధికారి సిహెచ్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ నర్సులందరికీ దత్తత ఓసులువైన ప్రక్రియ అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రైల్వే ఆసుపత్రి ఎఎన్‌ఓ దుర్గా, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ రమేష్, రైల్వే చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ కె శ్రీకాంత్, రజిని, సుల్తానాబేగం, తదితరులు పాల్గొన్నారు.