కృష్ణ

సీఎం పర్యటనకు 1000 మంది పోలీసు సిబ్బంది - డీఎస్పీ పోతురాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 17: నాట్యక్షేత్రం కూచిపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వెయ్యి మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు పేర్కొన్నారు. స్థానిక శ్రీ సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో బుధవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తుకు నియమించబడిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ పోతురాజు, చల్లపల్లి సీఐ జనార్ధన్, కూచిపూడి ఎస్‌ఐ దుర్గామహేశ్వరరావు రూట్ మ్యాప్‌లు, ట్రాఫిక్ కంట్రోల్, డైవర్షన్ ఏరియాల సమాచారంపై శిక్షణ ఇచ్చారు. ఎఆర్ అడిషినల్ ఎస్పీ బి ఢిల్లీ, ఎఆర్ డీఎస్పీ డి నారాయణరావులతో పాటు అడిషినల్ ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు ఐదుగురు, 39 మంది సీఐలు, ఎస్‌ఐలు 54 మంది, 700 మంది కానిస్టేబుల్స్‌ను నియమించినట్లు డీఎస్పీ తెలిపారు. సీఎం ప్రసంగించే బహిరంగ సభావేదికను సీఎం సెక్యూరిటీ అధికారులు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో మచిలీపట్నం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోప్ సిబ్బంది కూడా తరలి వచ్చారు. వీరితో పాటు ఎఆర్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ సిబ్బంది జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చారు. అధికారులు, అతిథులకు జిల్లా టీడీపీ కార్యదర్శి, మొవ్వ వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర బృందం భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు.

మిస్టర్ కృష్ణా యూనివర్శిటీగా కెవిఆర్ కళాశాల
నందిగామ, అక్టోబర్ 17: స్థానిక కెవిఆర్ కళాశాలలో జరిగిన బెస్ట్ ఫిజిక్ పోటీల్లో కెవిఆర్ కళాశాలకు చెందిన కోట కిరణ్ (ద్వితీయ బిఎ విద్యార్థి) మిస్టర్ కృష్ణా యూనివర్శిటీ టైటిల్ సాధించారు. ఈ టైటిల్‌ను కృష్ణా యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ నల్లూరి శ్రీనివాసరావు అందజేశారు. అదే విధంగా పవర్ లిఫ్టింగ్ మెన్ పోటీల్లో కెవిఆర్ కళాశాల (నందిగామ) ప్రధమ స్థానం, డిఆర్ జడ్‌హెచ్ కళాశాల (ఇబ్రహీంపట్నం) ద్వితీయ స్థానం సాధించగా వెయిట్ లిఫ్టింగ్‌లో డిఆర్ జడ్‌హెచ్ కళాశాల (ఇబ్రహీంపట్నం), కెవిఆర్ కళాశాల (నందిగామ), వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్‌లో కెవిఆర్ కళాశాల (నందిగామ), కెబిఎన్ కళాశాల (విజయవాడ) ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. కెవిఆర్ కళాశాల మెన్ అండ్ ఉమెన్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవశం చేసుకున్నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాగం వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు స్వామి, హేమంత్, పవర్ లిఫ్టింగ్ కృష్ణా సెక్రటరీ ఘంటా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో దోపిడీ పాలన
* వైకాపా నేత సామినేని విమర్శె
పేనుగంచిప్రోలు, అక్టోబర్ 17: అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో దోపిడీ పరిపాలన సాగిస్తోందని వైకాపా విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆరోపించారు. మాజీ జెడ్‌పీటీసీ కాకాని శ్రీనివాసరావు ఇం ట్లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మట్టి దోపిడీ తెలుగుదేశం హ యాంలో పెచ్చుమీరాయన్నారు. నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అనుచరులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారం అందిస్తూ పెద్దమొత్తంలో ముడుపులు అందుకుంటున్నారని ఆరోపించారు. గతంలో పెనుగంచిప్రోలు మండలం శనగపాడు, వత్సవాయి మండల ఆళ్లూరుపాడు ఇసుక క్వారీలపై మైనింగ్ శాఖ దాడులు నిర్వహించిందని, దానిలో అక్రమంగా ఇసుక రవాణా జరిగినట్లు రుజువు అయిన వారిపై లక్షల రూపాయల జరిమానా విధించారని, అయినా ఇప్పటికీ జరిమానాలు చెల్లించలేదన్నారు. పెనుగంచిప్రోలు పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏయే పనులు నిర్వహించారో తెలుసుకునేందుకు మినిట్స్ బుక్‌ను అడిగితే ఇవ్వడం లేదని, దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరణ కోరనున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో కూడా భారీ అవినీతి జరుగుతోందని, దీనిపై కూడా విచారణ నిర్వహించాలని ఆయన కోరారు. అనంతరం తూర్పుబజారు గింజుపల్లి వారి బజారులో జరుగుతున్న దేవీ నవరాత్రుల పందిరిలో మహిళాసురమర్దనిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ అమ్మవారిని సామినేని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల నిర్వహణ కమిటీ వారు సాదరంగా ఆహ్వానించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్నా, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకాని హరి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కొల్లా రఘురామయ్య, బీసీ సంఘం నాయకులు దేరంగుల శ్రీనివాసరావు, నరెడ్ల కిషోర్, ఆదిమూలం నర్శింహరావు, తదితరులు పాల్గొన్నారు.