కృష్ణ

రైతు శ్రేయస్సుకే అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, జూన్ 20: రైతులేనిదే రాజ్యం లేదని వారి అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర ప్రాథమిక విద్య, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారీల బారినపడి రైతులు మోసపోకుండా ప్రభుత్వం సహాయం నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే విధంగాను ఏరువులు, యంత్ర పరికరాలు, విత్తనాల పై వచ్చే సబ్సిడీ తదితరాలను నేరుగా వారి ఖాతాలో జమ అయ్యే విధంగా తగు చర్యల చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు రుణాలను అంచెలంచెలుగా రద్దు చేస్తుందన్నారు. నీరు అందెలా ఎత్తిపోతల పథకాలను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కైకలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ, జెడ్‌పిటిసి భూపతి నాగ కళ్యాణి, ఎంపిపి పోసిన కుమారి, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు ఈడ్పుగంటి వెంకట రామయ్య, జిల్లా నాయకులు నాగరాజు, చలసాని జగన్మోహనరావు, ఎడి జి వెంకటమణి, ఎఓ కె విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

ఐలూరు పుష్కర ఘాట్ వద్ద బయట పడిన విగ్రహాలు
తోట్లవల్లూరు,జూన్ 20: మండలంలోని ఐలూరులో మూడవ పుష్కరఘాట్ వద్ద మూడు విగ్రహాలు బయట పడ్డాయి. చాలాకాలంగా మూడవ ఘాట్‌ని అందరు మరచిపోయారు. ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో కూడా అక్కడకు ఎవరు వెళ్ళటంలేదు. దాంతో రోడ్డు ముళ్ళపొదలతో నిండిపోయింది. ఘాట్ వద్ద పుట్టలు లేచాయి. పూర్వం అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలు ముళ్ళచెట్ల మధ్య మట్టిలో కూరుకుపోయాయి. గత మూడు రోజులుగా జేసీబీతో ముళ్ళపొదల తొలగింపు చేపట్టటంతో విగ్రహాలు వెలుగు చూశాయి.

చెట్టు మీద నుంచి పడి ఇద్దరు చిన్నారులకు గాయాలు
తోట్లవల్లూరు, జూన్ 20: నేరుడు కాయలు కోయటం కోసం చెట్టు ఎక్కగా చెట్టుకొమ్మ విరిగి ఇద్దరు చిన్నారులు కింద పడి తీవ్ర గాయాలపాలైన సంఘటన తోట్లవల్లూరు సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తోట్లవల్లూరు గాంధీపార్కులోఉన్న నేరేడు చెట్టుకు విపరీతమైన కాయలు కాసాయి. ఇవి చూచిన పామర్తి కుమారస్వామి (13), గరికే అశోక్(12) నేరేడు కాయలు కోసేందుకు చెట్టు ఎక్కి చీటారు కొమ్మకు వెళ్ళారు. ఇద్దరు ఒకే కొమ్మ మీద ఉండి కాయలు కోస్తుండగా కొమ్మ విరిగిపోయింది. దీంతో కుమారస్వామి డ్రైనేజీ గోతిలో పడగా తలకు తీవ్రమైన గాయమయింది. అలాగే కాలు విరగగా, చెయ్యికు దెబ్బ తగిలింది. గరికే అశోక్‌కు రోడ్డు మీద పడగా స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108లో ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు.

మత్స్యకారులను దగా చేస్తున్న మత్స్య శాఖ
నాగాయలంక, జూన్ 20: సముద్రంలో వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు అందాల్సిన జీవన భృతిని అందించడంలో మత్స్య శాఖ విఫలమైందని ఎపి మత్స్యకారుల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు ఆరోపించారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గత యేడాది వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను రాష్ట్రంలో 86 వేల 948 మందిని గుర్తించిన మత్స్య శాఖాధికారులు ఈ ఏడాది 60 వేలుకు కుదించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్య శాఖాధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1871 మెకనైజ్డ్ బోట్లు, 14వేల 648 మోటారు బోట్లు సముద్రంలో చేపల వేట సాగిస్తున్నాయన్నారు. ఈ గణాంకాలను బట్టి మెకనైజ్డ్ బోటుపై ఎనిమిది మంది, మోటారు బోటుపై ఆరుగురు చొప్పున లక్షా 3వేల 856 మంది చేపల వేట చేస్తుండగా కేవలం 60వేల మందికి రూ.24కోట్లు భృతిగా కేటాయించడం గర్హనీయమన్నారు. మిగిలిన 43వేల 856 మంది మత్స్యకారుల మాటేమిటని ప్రశ్నించారు. గత ఏడాది 86వేల 949 మంది కుటుంబాలకు ప్రభుత్వం రూ.2వేలు చొప్పున భృతిగా మంజూరు చేయగా అందరికీ అందించడంలో మత్స్య శాఖాధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.