క్రైమ్/లీగల్

పండగరోజు విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, అక్టోబర్ 19: ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకొంది. సేకరించిన సమాచారం ప్రకారం చందర్లపాడులో దసరా పండుగను పురష్కరించుకొని మహిళలు బతుకమ్మలను కృష్ణానదికి తీసుకువెళ్లారు. వీరి వెంట ట్రాక్టర్‌లో కొత్తపల్లి గోపి (23) కూడా వెళ్లి బతుకమ్మలను నీటిలో వదిలిన తరువాత కాళ్లు కడుగుకొని వస్తానని లోనికి వెల్లగా నీటిలో లోతుగా ఉన్న గుంటలోకి పడి పోవటంతో నీట మునిగి పోయాడు. వెంటనే అక్కడున్న వారు వెతకగా చీకటి కావటంతో కనిపించలేదు. దీంతో సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఎస్సై సుబ్రహ్మణ్యం అధ్వర్యంలో జాలర్లను రంగంలోకి దించి వెతకగా గోపి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని నందిగామ తరలించి పోస్టుమార్టం నిర్వహించి వారి బందువులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, చిన్న పిల్లవాడు ఉన్నారు.

ఆవు పొడవడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలు - పరిస్థితి విషమం
* విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
గుడివాడ, అక్టోబర్ 19: గుడివాడ నీలామహల్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ఆవు పొడవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక ధనియాలపేటకు చెందిన ఐనంపూడి లక్ష్మణరావు(70) ఇంటి దగ్గర నుండి నడుచుకుంటూ పట్టణానికి వస్తున్నాడు. ఆవు ఉన్నట్టుండి అతన్ని పొడవడంతో మెడ దగ్గర తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తస్రావం కూడా జరగడంతో వెంటనే అతన్ని స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాధమిక వైద్యసేవలందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.