కృష్ణ

గుడివాడలో శ్రీమహారుద్ర సహిత శత చండీయాగం సంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 19: గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని కొడాలి నాని గ్రౌండ్స్‌లో జరుగుతున్న శ్రీమహారుద్ర సహిత శత చండీయాగం సంపూర్ణమైంది. ఈ నెల 10వ తేదీ నుండి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని-అనుపమ, సోదరుడు కొడాలి చిన్ని-శ్రీవిద్య దంపతులు పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. గత 10రోజుల్లో గుడివాడ నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 50వేల మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వేలాది మంది సువాసినీలచే సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. వీరందరికీ పూజాసామాగ్రిని ఉచితంగా అందజేశారు. అర్చన అనంతరం అమ్మవారి దీక్షా కుంకుమ, ప్రసాదం, చీర, రవిక, గాజులు తదితర మంగళద్రవ్యాలను పంపిణీ చేశారు. భక్తులందరికీ అన్నదానం చేశారు. అంతకు ముందు ప్రాతఃకాలార్చన, అగ్నితంత్రం, శ్రీమహారుద్ర పారాయణ, శ్రీశత చండీ పారాయణలు సంపూర్ణం, శ్రీశత చండీ హోమం, రుద్ర హోమం, ఆవాహిత మండప దేవతా మూలమంత్ర హోమాలు, శాంతి పౌష్టిక హోమం, శ్రీలలితా సహస్రనామ కుంకుమార్చన, త్రిశతి, ఖడ్గమాలార్చనలు, మహాపూర్ణాహుతి సమర్పణ, మహాదాశీర్వచనం, చతుర్వేద స్వస్తి, ప్రధానమూర్తికి ప్రదోషకాలు అర్చన, వేద పారాయణం, ప్రధాన కలశ ఉద్వాసన, ఆవాహిత మండప దేవతా ఉద్వాసన, యాగశాల ఉద్వాసన, ప్రోక్షణ, శమీపూజ, దర్బార్ సేవలను నిర్వహించారు. ప్రముఖ పండితులు ఫణికుమార్‌శర్మ, కుందుర్తి దుర్గాగణేష్‌ల ఆధ్వర్యంలో దీక్షాపరులైన రుత్వికులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్, పారిశ్రామికవేత్త పిన్నమనేని వీరయ్యచౌదరి, ఇలపర్రు పీఏసీఎస్ అధ్యక్షుడు సుంకర వెంకటరమణ, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి తదితరులు అమ్మవారి విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1గంటకు అమ్మవారి నిమజ్జనోత్సవం జరుగుతుందన్నారు. 12గంటలకు జరిగే భారీ అన్నసమారాధనలో భక్తులంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు లోయ రాజేష్, కొంకితల ఆంజనేయప్రసాద్, యార్లగడ్డ సత్యభూషణ్, దండమూడి శేషగిరిరావు, కళ్యాణ్ బాబాయ్, సర్దార్‌బేగ్, చండూరి శేఖర్, పసలాది శేఖర్, పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి, పొట్లూరి వెంకట కృష్ణారావు, జమదగ్ని, మామిళ్ళపల్లి వినయ్‌కుమార్, తాళ్ళూరి ప్రశాంత్‌రాజ్, డాల్డా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానంతో ఆరోగ్యవంతులు కావాలి
* ఎఎస్పీ సాయికృష్ణ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 19: రక్తదానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక పోలీసు ఫంక్షన్ ప్లాజాలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ఎఎస్పీ సాయికృష్ణ కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టగలుగుతామన్నారు. రక్తదానం పట్ల యువత చైతన్యవంతులై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో మొత్తం 48 మంది పోలీసు సిబ్బంది స్వచ్చందంగా రక్తదానం చేశారు. వీరందరినీ ఎఎస్పీ సాయికృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ బి ఢిల్లీ, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు, ఆర్‌ఐలు కృష్ణంరాజు, శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు రాజేష్, సతీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.