కృష్ణ

రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు విశేష కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, అక్టోబర్ 19: రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల టీడీపీ ఆధ్వర్యంలో గురువారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు, దివంగత మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు పలు సమస్యలు ఏర్పడ్డాయని, ఆ తరుణంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలలో, ఆ తరువాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజెపీ ప్రభుత్వం ఏ ఒక్క దానిని అమలుపర్చకపోవడం వల్లనే టీడీపీ ఆ పార్టీతో విభేదించి బయటకు రావల్సి వచ్చిందని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చేందుకే కేంద్రంపై ప్రత్యేక హోదాకై పోరాటం చేయవల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్భ్రావృద్ధి విషయంలో కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి శక్తివంచన లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఇతర వౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి సారిగా వెనుకబడిన వర్గాల వారికి, ఇతర పేద వర్గాల వారికి చట్టసభలలో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కారణంగానే తనలాంటి సామాన్యులు సైతం లోక్‌సభకు పోటీ చేసే అవకాశం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందుతుందని ఎంపీ గుర్తు చేశారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని మహనీయులలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అగ్రగామిగా నిలుస్తారన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన శాసనమండలి సభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం సామాన్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 18 రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఎల్‌జేకీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించటంతో పాటు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు అంబటి శ్రీహరిప్రసాద్, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, జెడ్పీటీసీ కన్నా నాగరాజు, జిల్లా టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి వర్రే రాంబాబు, ఎఎంసీ మాజీ చైర్మన్ మండవ బాలవర్దిరావు, వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్, బ్రాహ్మణయ్య విగ్రహాలను ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.

ఆయుధ పూజలో ఎస్పీ త్రిపాఠీ దంపతులు
మచిలీపట్నం, అక్టోబర్ 19: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కుటుంబ సమేతంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధ పూజ అనంతరం ఆయు సంపత్తి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ విజయాలను అందించే విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినం పోలీసులకు అత్యంత పవిత్రమైనదన్నారు. ఆయుధ పూజ ద్వారా అమ్మవారి కరుణాకటాక్షాలు పొందే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, ఎఆర్ అడిషనల్ ఎస్పీ బి ఢిల్లీ, ఎఆర్ డీఎస్పీ నారాయణరావు, స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకుల రఘు, ఆర్‌ఐలు కృష్ణంరాజు, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.