కృష్ణ

తిత్లీ బీభత్సం కనిపించ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 20: చడీచప్పుడు లేకుండా ఒక్కసారిగా పంజా విసిరిన తిత్లీ తుఫాన్ నుండి ఉత్తరాంధ్ర వాసులను కాపాడటంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో తుఫాన్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన ఆయన శనివారం మచిలీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను చావు దెబ్బ తీసిన తిత్లీ బారిన పడిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నారు. తుఫాన్ ముప్పు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి అని కూడా చూడకుండా టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికార యంత్రాంగంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని కూడా తట్టి లేపారన్నారు. సీఎం అప్రమత్తతోనే ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్నారు. అపారంగా ఏర్పడిన ఆస్తి నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా శ్రీకాకుళంలో మకాం చేసి 24గంటలూ నిరాఘాటంగా సహాయక చర్యలు చేపట్టారన్నారు. పుట్టెడు కష్టాల్లో ఉత్తరాంధ్ర ఘోష పెడుతుంటే ఆదుకోవల్సిన కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం గర్హనీయన్నారు. విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. సాక్షాత్తు విపత్తుల శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ గుంటూరు జిల్లాలో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారే గానీ శ్రీకాకుళం వైపు కనె్నత్తి చూడకపోవడాన్ని మంత్రి రవీంద్ర తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు సైతం సీఎం చంద్రబాబును విమర్శించడమే గానీ తుఫాన్ బాధితులకు అండగా నిలుద్దామన్న ఆలోచన కూడా చేయకపోవడం వారి స్వార్ధ రాజకీయాలకు తార్కాణమన్నారు. నన్ను సీఎం చేయండంటూ చెప్పులు అరిగేలా రోడ్ల మీద తిరుగుతున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డికి ఉత్తరాంధ్రుల అర్తనాధాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. మరో పక్క ఉత్తరాంధ్రకు భరోసాగా నేనున్నానంటూ స్టేజీ ప్రసంగాలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తిత్లీతో నష్టపోయిన ఉత్తరాంధ్రులను పరామర్శించడానికి వారం రోజులు పట్టిందా అని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీ నేతలకు ప్రజల కష్టాలు ఏ మాత్రం కనిపించవు అనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

సిటీ కేబుల్ ఎండీ ‘కొల్లు’కు పితృవియోగం
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 20: మచిలీపట్నం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సిటీకేబుల్) ఎండీ కొల్లు శ్రీనివాస్‌కు పితృవియోగం కలిగింది. రైల్వేలో పని చేసి పదవీ విరమణ చేసిన శ్రీనివాస్ తండ్రి రామచంద్రరావు (82) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని), టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య)తో పాటు మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ, బీజేపీ నాయకులు పంతం వెంకట గజేంద్రరావు తదితరులు రామచంద్రరావు భౌతికకాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఆరుతడి పంటలకు ప్రాణం పోయాలి
మైలవరం, అక్టోబర్ 20: ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి మూడవ జోన్‌కు విడుదలవుతున్న సాగర్ జలాల పరిమాణాన్ని మరింత పెంచి ఆరుతడి పంటలను ఆదుకోవాలని సాగునీటి సంఘాల నేతలు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు నీటిపారుదల శాఖ అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ శనివారం స్థానిక విలేఖర్లకు వివరించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17న మూడోజోన్‌కు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 102 కిలో మీటరు వద్దకు 880 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అనంతరం ఎగువ భాగాన తెలంగాణ ప్రాంతంలో డిమాండ్ అధికంగా ఉండటంతో దిగువకు నీటి విడుదల తగ్గుతున్న నేపధ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు శనివారం ఉదయం రాష్ట్ర సాగునీటి సంఘాల సారధుల ఆధ్వర్యంలో ఎడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వై పుల్లయ్య చౌదరి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నాదెళ్ళ చెన్నకేశవరావు, నూజివీడు ఎనె్నస్పీ ఏఈఈ పి భక్తవత్సలంతో కలసి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో నాగార్జున సాగర్ ఎడమకాలువ సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను స్వయంగా కలిసి విన్నవించినట్లు తెలిపారు. ప్రస్తుతం విడుదలవుతున్న సాగునీటి విడుదల 1500 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. ఈ నెల 21నుండి ఆఫ్ టైంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సాగరు నీటి విడుదలను నిరాటంకంగా కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అధికారులకు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం మూడో జోన్‌లో కాలువల కింద రైతులు సాగు చేస్తున్న పత్తి, మిర్చి, పొగాకు, మొక్కజొన్న, కంది, మినుము, వరి తదితర పంటలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ ఎనె్నస్పీ ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి స్పందిస్తూ ప్రస్తుతం తెలంగాణలో ఎగువ భాగంలో సాగునీటి తీవ్ర ఇబ్బంది ఉందని రెండురోజుల్లో కాలువ ఎగువభాగంలో ఉన్న రెగ్యులేటర్లలో నీటి విడుదలను పరిమితం చేసి ఏపీలోని మూడో జోన్‌కు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయటానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాన నాగార్జున సాగరు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో నాగార్జున సాగర్ హెడ్ రెగ్యులేటర్ నుండి ఆంధ్ర బోర్టర్ 102 కిలో మీటర్ల వరకూ 280 కిలోమీటర్ల మేర రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులతో నిరంతరం నిఘా టీములను ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టి కెఆర్‌ఎంబి ఆదేశాలను అమలు పరచి ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఏపీ ఎనె్నస్పీ అధికారులు, తెలంగాణ ఎనె్నస్పీ అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.