కృష్ణ

అమరవీరుల త్యాగం స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 21: ప్రజల మాన, ప్రాణ, ఆస్తి రక్షణ కోసం తమ ప్రాణాలను అడ్డువేసే త్యాగశీలురు, ముష్కర మూకలను తరిమికొట్టే ధీరులు, అసాంఘీక శక్తుల ఆటకట్టించే శూరులు, సమాజహితం కోసం ఎన్నో త్యాగాలు చేసే వీరులే పోలీసులని జిల్లా పోలీసు సూపరింటెండెంటు సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత పోలీసు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ సమాజానికి అందిస్తున్న నిష్పక్ష సేవలు అభినందనీయమన్నారు. వారి త్యాగాలు వెలకట్టలేమన్నారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అమర వీరుల కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ముడు రిజర్వు పోలీసులు ఆర్‌ఐ కృష్ణంరాజు పర్యవేక్షణలో కవాతును నిర్వహించగా జిల్లా ఎస్పీ త్రిపాఠితో పాటు లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గౌరవ వందనం సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎస్ సాయికృష్ణ సంవత్సర కాలంలో దేశం మొత్తంలో విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరుల పేర్లను చదివి వినిపించారు. ఎఆర్ అడిషనల్ ఎస్పీ బి ఢిల్లీ బాబు, డీఎస్పీలు ఉమామహేశ్వరరావు, మోహబూబ్ భాషా, రాజేంద్రబాబు, వెంకటేశ్వర్లు, నారాయణరావు, రామారావు, ఎవో మూర్తి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, అమరవీరులకు పూలు, పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు.