కృష్ణ

ఘనంగా ఆటోనగర్ స్వర్ణోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూన్ 25: ప్రపంచీకరణ నేపథ్యంలో యాత్రికరణలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కార్మికులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని బిసి సంక్షేమ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జవహర్ అటోనగర్ 50వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆటోనగర్‌లో స్వర్ణోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కొల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్‌కు, మచిలీపట్నానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. మచిలీపట్నం పోర్టు వస్తే ఆటోనగర్ రవాణా రంగానికి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రప్రభుత్వం జల రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్మికుల 1.50 లక్షల మంది కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 రోజులలోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సు నిర్వహించగా 40 దేశాల నుండి 400 మంది ప్రతినిధులు హాజరై 350 ఎంఓయు కుదుర్చుకున్నారని ఆంధ్రప్రదేశ్‌లో 4లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టటానికి ముందుకొచ్చారని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని మాట్లాడుతూ ఆటోనగర్‌కు తనకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే తాను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావటానికి ఆటోనగర్ కార్మికులు, యజమానులు కారణమని చెప్పవచ్చన్నారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆటోనగర్ శంకుస్థాపన చేసిన అనాటి ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాగే అటోనగర్ ఏర్పాటు చేయటానికి కృషి చేసిన పెద్దలను నేడు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడకు దేశ వ్యాప్తంగా పేరురావటానికి ఆటోనగర్ కారణమన్నారు. ఆటోనగర్ ఐలా ఏర్పడటానికి మాజీ కేంద్ర మంత్రి దివంగత యర్రంనాయుడు కృషి ఎంతో ఉందన్నారు. ఆటోనగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ హబ్ కచ్చితంగా ఏర్పాటు చేయటం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆటోనగర్ గ్టుంతిప్ప డ్రైయిన్ రోడ్డుకు 22 కోట్లు నిధులు మంజూరైనాయని, త్వరలో టెండర్లు పిలవటం జరుగుతుందన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ ఆటోనగర్‌లో వర్గాలుగా విడిపోయి ఆటోనగర్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతీయవద్దన్నారు. ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వై.వి. ఈశ్వరరావు మాట్లాడుతూ మతసామరస్యానికి పెట్టింది పేరు జవహర్ ఆటోనగర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, కార్యదర్శి పంచుమర్తి ప్రసాదరావు, మెకానిక్ అసోసియేన్ అధ్యక్షుడు కమ్మిలి సత్యనారాయణ, ఏటిఏ మాజీ అధ్యక్షులు, దివాకర్‌రావు, గొల్లపూడి నాగేశ్వరరావు, మలినేని నారాయణ ప్రసాద్, డివికె రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ‘అమృత్’ వార్హికోత్సవం
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 25: దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన అమృత్‌పథకం మొదటి వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమృత్ పథకం అమలు తీరుపై దేశ ప్రధాని టెలివిజన్‌లో చేసిన ప్రసంగాన్ని వీక్షించేందుకు విఎంసి కౌన్సిల్ భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో నగర కార్పొరేటర్లతోపాటు విఎంసి అధికారులు ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించారు. ఆటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ మరియు అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ (అమృత్) పథకంలో భాగంగా దేశంలోని 500నగరాల్లోప్రారంభించిన విషయం విధితమే.