కృష్ణ

పర్యాటక కేంద్రంగా కొండపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం: కొండపల్లి ఖిల్లా పూర్వవైభవం సంతరించుకునే విధంగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని కొండపల్లి ఖిల్లా ప్రాంతాలను పర్యాటక శాఖ అధికారులు హిమాన్షు శుక్లా, పురావస్తుశాఖ కమిషనర్ వాణిమోహన్‌తోపాటు అధికారులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఖిల్లాలోని పురాతన శిలలను, రాజమహల్, కారాగారం ప్రాంతాలను చూశామన్నారు. డిసెంబర్ నెల మూడవ వారంలో రెండు రోజులు ఖిల్లాపై ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఆ మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారని వివరించారు. ఫొటో ఎగ్జిబిషన్, మూజియం ప్రారంభిస్తారని తెలిపారు. రాజధానికి అనుసంధానంగా ఉన్న కొండపల్లి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు, జంపాల సీతారామయ్య, రాధాకుమార్, చిట్టిబాబు, నారాయణ, సీఐ పవన్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా వర్సిటీ హాకీ జట్టు ఎంపిక
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 8: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఈ నెల 3వతేదీ నుండి నిర్వహిస్తున్న కృష్ణా విశ్వ విద్యాలయం హాకీ జట్టు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. గురువారం జట్టు క్రీడాకారులను ఎంపిక చేశారు. పిబి సిద్దార్ధ కళాశాల నుండి బి సత్తిబాబు, ఎస్ రాజ్ కుమార్, శారదా కాలేజ్ నుండి పి దేవీ వర ప్రసాద్, బి మణికంఠ, నలందా డిగ్రీ కాలేజీ నుండి టి శ్రీనివాసరావు, జి రతన్ (కెప్టెన్), ఎల్ సాయి సూర్య, ఎం గూబుమూర్తి, విజయా ఫసికల్ ఎడ్యుకేషన్ కాలేజీ నున్న నుండి ఎం వినోద్, సిహెచ్ అరుణ్ కుమార్, ఎం వినయ్ కుమార్, వి సాయి కిరణ్‌లను ఎంపిక చేసినట్లు కృష్ణా వర్సిటీ క్యాంపస్ కళాశాల ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్ శ్రవణం రామకృష్ణ తెలిపారు. వీరు ఈ నెల 10వతేదీ నుండి 14వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే సౌత్ జోన్ అంతర్ విశ్వ విద్యాలయాల పురుషుల హాకీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు రామకృష్ణ తెలిపారు.

నేడు బందరులో వైసీపీ కార్యాలయం ప్రారంభం
మచిలీపట్నం, నవంబర్ 8: మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ బందరు నియోజకవర్గ కన్వీనర్, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తెనాలి మాజీ పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరిని పార్టీ అధినేత జగన్ నియమించారన్నారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు లక్ష్మీటాకీసు సెంటరులోని పాత ఆర్టీఓ కార్యాలయ భవనంలో పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కెపి సారథి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటారని పేర్ని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, లంకే వెంకటేశ్వరరావు, మాదివాడ రాము, మోకా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.