కృష్ణ

డ్వాక్రా మహిళల సంక్షేమానికి కట్టుబడ్డాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: డ్వాక్రా మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన మండలంలోని మొర్సుమిల్లి గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ కింద 2.76 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పీకలలోతు అప్పుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేసి, వారికి తిరిగి రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధితో గ్రామాల రూపు రేఖలనే మార్చేసినట్లు తెలిపారు. విద్యుత్, వైద్యం, రోడ్లు, డ్రైన్లు, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుతోపాటు గ్రామాలలో వౌలికవసతులన్నింటినీ కలుగజేశామని పేర్కొన్నారు. అదేవిధంగా సాగరు జలాలను రప్పించి పంటలను కాపాడామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పధకాలను రెండు కళ్ళుగా చేసుకుని పని చేస్తుంటే కొందరు దొంగలు అక్రమార్జనతో గ్రామాల్లోకి వచ్చి డబ్బుతో అధికారాన్ని పొందాలని చూస్తున్నారని వారి కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొర్సుమిల్లి గ్రామంలో అన్ని వీధులలో తిరిగి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుకున్నారు. మిగిలిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

18 నుండి శ్రీ పాండురంగడి ఉత్సవాలు
మచిలీపట్నం(కల్చరల్), నవంబర్ 8: స్థానిక చిలకలపూడి పాండు రంగడి ఉత్సవాలను ఈ నెల 18వతేదీ నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన పాండు రంగడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పాండు రంగడి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల కార్తీక శుద్ద దశమి 18వ తేదీ ఆదివారం నుండి ఈనెల 23వ తేదీ పౌర్ణమి వరకు శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీ పాండురంగ స్వామి మహిమను దేశ విదేశాల్లో ప్రాచుర్యం చేసే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాలుగా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు వస్తున్నారన్నారు. 18వ తేదీన గణపతి పూజ, గురుపూజ, గోపూజ, విష్ణుసహస్రనామ పారాయణ, పల్లకి ఉత్సవముతో ప్రారంభమయ్యే పాండురంగ స్వామి ఉత్సవాలు 19వ తేదీ ఏకాదశి సోమవారం సత్యన్నారాయణ స్వామి వ్రతం, బ్రహ్మోత్సవం, రుక్మిణి పాండురంగ స్వామి కల్యాణం, 20న రథోత్సవం, 21న నాగులేరు మంచినీటి కాలువలో స్వామివారి తెప్పోత్సవం, 22న కోలాట భజనలు, 23న సముద్ర స్నానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాగర హారతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పి కాశీవిశ్వనాధం, మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, ఇలియాస్ పాషా, అక్కుమహంతి రాజా, కౌన్సిలర్ కొట్టే వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.