కృష్ణ

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడ్డాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్న పత్రికా రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్‌కె ప్యారడైజ్‌లో విలేఖర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు విలేఖర్ల సంక్షేమాన్ని గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు మంజూరు చేశారన్నారు. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా వారి జీవితానికి భద్రత కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విలేఖర్లకు కూడా అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీతో కూడిన పక్కా గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నివేశన స్థలాల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. 48 మంది విలేఖర్లకు సెంటున్నర చొప్పున నివేశన స్థలాలు మంజూరు చేయగా కొంత మంది వాటిపై హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం దురదృష్టకరమన్నారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. అవసరమైతే నెల రోజుల వ్యవధిలో ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే మచిలీపట్నం ప్రెస్ క్లబ్‌కు పట్టణ నడిబొడ్డులో స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో పాటు రాజ్యసభ సభ్యుల నిధులతో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఇతోదిక సాయమందిస్తామన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల సంఘాలు యాజమాన్యాలపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రెస్ క్లబ్ కన్వీనర్ అంబటి శేషుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రతి ఆదివారం పంచారామాలకు
ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు
మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 8: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అన్ని వర్గాల ప్రజలకు ఒకే రోజున పంచారామ క్షేత్రాల దర్శనభాగ్యం కల్పించేందుకు ఏపీఎస్ ఆర్‌టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోందని మచిలీపట్నం డిపో మేనేజర్ పిఎన్‌విఎమ్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరారామం (అమరావతి), సోమారామం (్భమవరం), క్షీరారామం (పాలకొల్లు), దక్షారామం (ద్రాక్షారామం), కుమారరామం (సామర్లకోట)లను ఒకే రోజున దర్శించడానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం రాత్రి 11గంటలకు మచిలీపట్నం నుండి బయలుదేరి పంచారామం దర్శనం అనంతరం సోమవారం రాత్రికి మచిలీపట్నం చేరుకోవడం జరుగుతుందన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుకు పెద్దలకు రూ.920లు, పిల్లలకు రూ.690లు, అల్ట్రా డీలక్స్ సర్వీసుకు పెద్దలకు రూ.870లు, పిల్లలకు రూ.660లు టిక్కెటు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆన్‌లైన్ బస్సు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.